తూర్పుగోదావరి

సైకాలజిస్ట్‌ల సేవలు వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వర్ణాంధ్ర నిర్మాణానికి కౌనె్సలింగ్ సైకాలజిస్ట్‌ల సేవలు వినియోగించుకోవాలని ప్రోగ్రసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ హిప్నో కమలాకర్ అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం డాక్టర్ గరిమెళ్ల సత్యనారాయణ ఉన్నత పాఠశాలలో ఉభయ గోదావరి జిల్లాల సైకాలజిస్ట్‌ల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు హిప్నో కమలాకర్ మాట్లాడుతూ కౌనె్సలింగ్ సైకాలజిస్ట్‌లు సామాజిక బాధ్యత కలిగి వుంటారన్నారు. మంచి వ్యక్తిత్వ వికాసం కలిగి వుంటారన్నారు. ప్రభుత్వపరంగా సైకాలజిస్ట్‌ల సేవలు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రిని కలవనున్నట్టు చెప్పారు. త్వరలో జిల్లాల వారీగా సైకాలజిస్ట్‌ల జాబితాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు అందించనున్నామన్నారు. మండలానికి ఒక సైకాలజిస్ట్ అవసరం వుంటుందన్నారు. కుటుంబ, సామాజిక సమస్యలెన్నో ఎదురవుతున్నాయని, వీటి పరిష్కారానికి కౌనె్సలింగ్ సైకాలజిస్ట్‌ల సేవలు వినియోగించుకుంటే సమాజంలో మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. సమాజానికి సైకాలజిస్ట్‌ల సేవలు చాలా అవసరమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ సైకాలజిస్ట్‌ల వృత్తిని సమాజం గుర్తించిందని, చట్టబద్ధమైన గుర్తింపు రావాల్సి వుందన్నారు. మెడికల్ కౌన్సిల్ మాదిరిగానే సైకాలజిస్ట్‌ల కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఉపాధ్యక్షుడు డాక్టర్ మహాలక్ష్మికుమార్, జాతీయ కోశాధికారి సన్‌షైన్, పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ అక్కింశెట్టి రాంబాబు, ఉభయ గోదావరి జిల్లాల కౌనె్సలింగ్ సైకాలజిస్ట్‌లు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులోనే ప్రభుత్వ సేవలు: ఎమ్మెల్యే అనంతలక్ష్మి
కాకినాడ రూరల్, నవంబర్ 6: తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎపుడూ అందుబాటులోనే ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా చీడిగ గ్రామంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. చీడిగ గ్రామాన్ని కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ ఆదుకున్నామన్నారు. గ్రామంలో ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లి సత్యనారాయణమూర్తి, జడ్పీటిసి కాకరపల్లి సత్యవతి, చలపతిరావు, మట్టా ప్రకాష్ గౌడ్, పితాని అప్పన్న పాల్గొన్నారు.