తూర్పుగోదావరి

కరెన్సీ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 8: సామాన్యుడిపై కరన్సీ పిడుగు పడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన ‘పెద్ద’ నోట్ల మారక నిషేధంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ప్రయాణాల్లో ఉన్న పౌరులు జేబుల్లో రూ.500, వెయ్యి నోట్లే ఉండడంతో మారక నిషేధంతో దిక్కుతోచని పరిస్థితి చవి చూడాల్సి వచ్చింది. అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చినప్పటికీ ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో మంగళవారం రాత్రి నుంచే అనధికారికంగా నిషేధం అమల్లోకి వచ్చినట్లయింది. పెద్ద నోట్లు చూసేసరికే భయపడిపోయే పరిస్థితి దాపురించింది. ఉపాధి హామీ కూలీల చేతుల్లోనే రూ.500 నోట్లు కనిపిస్తున్న తరుణంలో వాటి చలామణిలో ఇప్పుడు ఆ సామాన్యులకు కూడా అయోమయం నెలకొంది. సాధారణంగా రూ.100, రూ.50 నోట్లు చూసి చాలా రోజులు అయినట్లుగా ప్రతి వారి చేతుల్లో రూ.500, రూ.1000 నోట్లే చలామణి అవుతున్న క్రమంలో ఒక్కసారిగా ఈ నోట్లు ఇక మారవు.. అని తెలిసేసరికి ఆ ప్రభావం అన్ని వర్గాలపై చూపిస్తోంది. కోట్ల రూపాయల వస్త్ర వ్యాపారానికి, వివిధ రకాల చిల్లర వ్యాపారాలకు కేంద్రమైన రాజమహేంద్రవరంలో వ్యాపార కార్యకలాపాలు స్తంభించే పరిస్థితి తలెత్తింది.
సాధారణంగా నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతున్న పరిస్థితి ఉంది. హోల్‌సేల్ వర్తకుల వద్దకు పెద్ద నోట్ల కరెన్సీతో వచ్చిన రిటైల్ వర్తకులు ఈ ప్రకటనతో కొనుగోళ్లు నిల్చిపోయిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వివిధ రకాల వ్యాపారులు, హోటళ్లల్లో రాత్రి నుంచే పెద్ద నోట్లను తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో వినియోగదారులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. వాణిజ్య కేంద్రమైన రాజమహేంద్రవరంలో కోట్ల వ్యాపార కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించాయి. పెద్ద నోట్ల చలామణి స్తంభించి వ్యాపార లావాదేవీలు మందగించాయి. బుధవారం ఉదయం నుండి బ్యాంకులకు పెద్ద నోట్లతో బారులుతీరే పరిస్థితి దాపురించింది. మరో వైపు రెండు రోజులపాటు ఎటిఎంలు కూడా పనిచేయవనే ప్రచారం జరుగుతుండడంతో అన్ని వర్గాల్లో ప్రజల్లో అలజడి కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రధానంగా స్వగ్రామాలకు దూరంగా ఉన్నవారు, వివిధ ప్రయాణాల్లోను, వివిధ వ్యాపార కార్యకలాపాల్లోను, ఇంటికి దూరంగా ఉన్న పౌరులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఎదురైంది. పెట్రోలు బంకుల వద్ద పెద్ద నోట్లతో తమతమ వాహనాల్లో పెట్రోలు పోయించుకునేందుకు బారులు తీరారు. వ్యాపారులు పెద్ద ఎత్తున బుధవారం నుంచి బ్యాంకుల్లో మారకాలు చేసి చిన్న నోట్లుగా మార్చుకునే తాపత్రయంలో పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లక్షలు, కోట్లలో లావాదేవీలు నిర్వహించే సంస్థల్లో ఈ నిషేధిత నోట్ల విషయంలో తీవ్ర గుబులు రేకెత్తింది.