తూర్పుగోదావరి

మూతపడుతున్న చిన్న సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 13: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాల దృష్టా భారత దేశంలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మూత పడుతున్నాయని దక్షిణ భారత సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్ధ (ఎస్‌ఐఎంఎస్‌ఇడిసి) ఛైర్మన్ శ్రీబలుసు వెంకట రామారావు పేర్కొన్నారు. ఆదివారం రామారావు కాకినాడలో విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ దేశంలో పరిశ్రమల మూతపడటమే కాకుండా యాజమానులు అనేక రకాల ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దక్షిణ భారత దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యం 100 కోట్ల మూలధనంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) తరహాలో అభివృద్ధి సంస్ధను ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్ధ ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు శిక్షణను ఇచ్చి వారి చేత పరిశ్రమలు ఏర్పాటు చేయించడం, వారికి వ్యాపార మెళకువలను నేర్పించటమే సంస్ధ లక్ష్యమన్నారు. వారికి అవసరమైన ముడి సరుకు, ఉత్పత్తి, రుణ సౌకర్యం తమ సంస్ధ అందిస్తుందని చెప్పారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రవేశ పెట్టిన సిజిటిఎంఎస్‌ఇ పధకంలో ఎటువంటి హామీ లేకుండా 5 లక్షల నుండి కోటి రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉన్నా అది ఆచరణలో లేదన్నారు. అలాగే 2015లో ప్రధాని నరేంద్రమోదీ ముద్రా పధకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పధకంలో 50 వేల నుండి 10 లక్షల వరకు ఎటువంటి హామీ లేకుండా బ్యాంకులు రుణాలివ్వాలని అవి అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ, ముద్రా పధకాలపై దక్షిణ భారత వ్యాప్తంగా చైతన్య సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న తిరుపతి, 20న చైనె్న, 24న బెంగళూరు, 26న త్రివేండ్రం, 27న పుదుచ్చేరిలో నిర్వహించి సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలపై పధకాలు, రుణాల తీరును ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు వివరిస్తామని చెప్పారు. ఆ నివేదికను ప్రధాని మోదీకి అందిస్తామన్నారు. సూక్ష్మ పరిశ్రమలకు 4 శాతం, చిన్న పరిశ్రమలకు 6 శాతం వడ్డీకి రుణాలివ్వాలని మోదీని కోరతామని రామారావు తెలిపారు.