తూర్పుగోదావరి

వైభవంగా ఉగాది వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఏప్రిల్ 8: దుర్ముఖి నామ ఉగాది వేడుకలను అమలాపురం పట్టణంలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవిస్తే అభివృద్ధి, సమత, మమతలు వర్ధిల్లుతాయని ప్రముఖ సాహితీ వేత్త రేఖపల్లి శ్రీనివాసమూర్తి అన్నారు. దుర్ముఖి నామ ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక సాహితీ మిత్రమండలి ఆధ్వర్యంలో రేఖపల్లి కాంప్లెక్సులో నిర్వహించిన సాహిత్య సభకు రేఖపల్లి అధ్యక్షత వహించారు. ప్రతీ ఏటా సాహితీ మిత్ర మండలి అందజేసే ఉగాది పురస్కారాన్ని ఈ ఏడాది మహీధర్ రామశాస్ర్తీకి సాహితీ వేత్త రేఖపల్లి చేతుల మీదుగా అందజేశారు. ఉగాది కవి సమ్మేళనం, పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆదారాజు సత్యనారాయణ, బివివి సత్యనారాయణ, నల్లా నరసింహమూర్తి, వడ్లమాని సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భట్నవిల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించిన ఉగాది వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అమలాపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీసుబ్బాలమ్మ, నూకాలమ్మ, రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల వద్ద ఉగాది ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్ల తీర్థోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ పెద్దిరెడ్డి సాయిపుల్లయ్యనాయుడు, సభ్యులు కట్టమూరి బుచ్చిరాజు, కాళే వెంకటేశ్వరరావు, గంటి నాగలక్ష్మి, రవణం సుభాకర్, దేశినీడి శ్రీనివాసరావు, బిఎస్‌కె వర్మ, ఇఒ బొక్కా వెంకటేశ్వరరావులు భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు గంగుమళ్ల బుజ్జి, జి రామకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్, చందన బ్రదర్స్ ఆధ్వర్యంలో మంచినీరు, పులిహోరా, స్వీట్లు అందజేశారు. అలాగే పట్టణానికి చెందిన మానవతా స్వచ్ఛంద సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది ముషిణి రామకృష్ణారావు ఆధ్వర్యంలో సూర్యానగర్‌లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కవి సమ్మేళనంలో తెలుగు దుర్ముఖి నామ సంవత్సర ప్రత్యేకతను వివరించారు. కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను ఘనంగా సత్కరించారు. అలాగే స్థానిక కామాక్షీ పీఠంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామాక్షీ పీఠాధిపతి కామేశమహర్షి 79వ జన్మదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నండూరి చంద్రమతీదేవి రచించిన గ్రంథాలను కామేశమహర్షి ఆవిష్కరించారు.
రామచంద్రపురం: శ్రీదుర్మిఖి నామ తెలుగు సంవత్సర ఉగాది వేడుకలు రామచంద్రపురం పట్టణంలోనూ, మండల పరిధిలోనూ, కె గంగవరం మండలంలోనూ గ్రామ గ్రామాన్నా ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమాలతోపాటు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. కొన్ని ప్రదేశాలలో చక్రపొంగళి, పులిహోర, స్వీట్‌ల పంపిణీ చేశారు. పట్టణంలోని శ్రీగాయత్రి బ్రాహ్మణ సమితి ట్రస్టు నేతృత్వంలో శుక్రవారం ముచ్చిమిల్లి రహదారిలోని సాయిబాబా గుడి ప్రాంగణంలో ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణిత ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ అమ్మావఝుల సీతారామయ్య (రమేష్) ముందుగా పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ట్రస్టు అధ్యక్షులు తటవర్తి రాఘవరాజుశర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వేద పండితులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం దంపతులు, ఆణిముత్యం అవార్డు గ్రహీత మున్సిపల్ కమిషనర్ నూకల మురళీకృష్ణ దంపతులు, ఎఎంసి డైరెక్టర్ పెదపాటి సుభాష్ చంద్రబోస్‌లను సత్కరించారు. ప్రముఖ పంచాంగకర్త దివంగత పిడపర్తి పూర్ణయ్య సిద్ధాంతి పేరిట ఏర్పడిన విజ్ఞాన ట్రస్టు, బుద్ధవరపు మహాదేవుడు మంగాయమ్మ సనాతన ధర్మ ట్రస్టు, కొండేపూడి జోగన్న, పెదపాటి సుభాష్ చంద్రబోస్‌ల సౌజన్యంతో ఆర్థికంగా వెనుకబడిన వృద్ధులకు నగదు పారితోషికాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్ లిమిటెడ్ అందిస్తున్న పథకాలను ట్రస్టు కన్వీనర్ తటవర్తి శ్రీనివాస్ సభకు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శిష్టా అమ్మన పంతులు, గరికిపాటి రామకృష్ణ, ఆరాద్ధి శ్రీ్ధర్, భాగవతి వీరభద్రరావు, ఊలపల్లి విజయకుమార్ తదితర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
ద్రాక్షారామలో..
దక్షిణకాశీ ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ్భమేశ్వర స్వామివారి ఆలయంలో దుర్మిఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆలయ కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతిరావు నేతృత్వంలో ఘనంగా జరిగాయి. ఉగాది నుండి ప్రారంభమయ్యే వసంత నవరాత్ర పూజలను ఇఒ చలపతిరావు తొలి రోజున నిర్వహించారు. ఆలయ అనువంశిక అర్చక స్వాములు, స్వస్తివాచకులు, పురోహిత బ్రహ్మ దేవులపల్లి కృష్ణమూర్తితోపాటు వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాయవరం: మండలంలోని విజయదుర్గా పీఠంలో దుర్ముఖి నామ సంవత్సరం ఉగాది వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం పీఠంలో ఉన్న పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గాడ్ భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు. కుజుడు వక్రీకరించినందున విపత్కర పరిస్థితులు, రోడ్డుప్రమాదాలు ఎక్కువై ప్రాణ నష్టం సంభవిస్తుందన్నారు. అందరూ తమ ఇష్టదైవాలను ఆరాధించడం ద్వారా వాటిని అధిగమించాలని ఉద్భోదించారు. అనంతరం భక్తి టీవీ దుర్ముఖి నామ సంవత్సర ఆధ్యాత్మిక పంచాంగాన్ని గాడ్‌చే ఆవిష్కరింపజేశారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు, పిఆర్వో బాబి, వేద పండితులు చీమలకొండ వీరావధాని, శ్రీనివాసావధాని, చక్రవర్తుల మాధవాచార్యులు, కోట లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.