తూర్పుగోదావరి

ఏజెన్సీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, డిసెంబర్ 2:తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో అమలవుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. మండల కేంద్రమైన మారేడుమిల్లిలో శుక్రవారం ఆయన రంపచోడవరం, చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులు దినేష్‌కుమార్, జి చినబాబు, వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. స్థానిక వనవిహరీ అతిధిగృహంలో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా ముంపు మండలాలైన చింతూరు,కూనవరం,వరరామచంద్రపురం, ఎటపాక మండలాల్లో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని సూచించారు. ఆయా మండలాల్లో అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇఇ నాగేశ్వరరావు, పిహెచ్‌వో శ్రీనివాసులు, డిఇఇ ఇ శ్రీనివాసులు, ఎపిడి శంకర్‌నాయక్, జిసిసి డిఎం జోగేశ్వరరావు మండల అభివృద్ధి అధికారి కె సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నానాజీ
కాకినాడ, డిసెంబర్ 2: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత పంతం వెంకటేశ్వరరావు(నానాజీ) నియమితులయ్యారు. ఈ మేరకు నానాజీకి పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి నుండి నియామక ఉత్తర్వులు అందాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కందుల దుర్గేష్ రాజీనామా చేయడంతో నానాజీకి అధ్యక్షత బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీలో నానాజీ గతంలో ఎన్నో పదవులు చేపట్టారు.