తూర్పుగోదావరి

పశువులకు దాణా కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, డిసెంబర్ 4: పశువుల దాణాకు ఉపయోగపడే ఎండుగడ్డి పేపరు మిల్లులకు తరలిపోవడంతో పశువుల దాణాకు కష్టమవుతోందని రైతులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో కోత యంత్రాల ద్వారా వరిని కోయడంతో ఎండుగడ్డి పశువులకు పనికి రాకుండాపోతోంది. కొద్దోగొప్పో రైతులు వరిని కోసి తద్వారా ఆ ఎండుగడ్డిని అధిక ధరల కోసం ఫ్యాక్టరీలకు అందచూపడంతో పశుసంపద నిర్వీర్యమవుతోంది. పచ్చగడ్డి కోసం రైతు గడ్డి విత్తనాలు చల్లినా నీటి సదుపాయం లేక పచ్చగడ్డి కూడా మొలవడంలేదు. చిట్టు, తౌడు నుంచి నూనె తీసే కర్మాగారాలు రావడంతో పశువులకు నాణ్యమైన దాణా అందడంలేదు. ఈ దాణా లోపం వల్ల పశువులు నీరసిస్తున్నాయి. పశుపోషణ సరిగా లేకపోవడంతో పాల దిగుబడి తగ్గి ప్రజలు అల్లాడుతున్నారు. పాల ధర కూడా నానాటికీ పెరుగుదల కన్పిస్తోందని పాల వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతులు ఎండుగడ్డిని అక్రమంగా తరలించడంతో పశుసంపద నిర్వీర్యమవుతోందని చిన్న, సన్నకారు రైతులు వాపోతున్నారు. ఇదేవిధంగా కొనసాగినట్టయితే పశుసంపద మరింత జఠిలమవుతుందని సర్వత్రా ఆందోళనలు వినిపిస్తున్నాయి.
25కేజీల నల్లమందు స్వాధీనం
రాజమహేంద్రవరం, డిసెంబర్ 4: విశాఖజిల్లా చింతపల్లి ఏజెన్సీ నుంచి రాజమహేంద్రవరంకు అక్రమంగా తరలిస్తున్న 25కేజీల నల్లమందును వన్‌టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఆదివారం ఉదయం గోదావరిగట్టున తనిఖీలు నిర్వహిస్తుండగా తుని మండలం రాపాకకు చెందిన డి వీరవెంకటసత్యనారాయణ, మల్లవరంనకు చెందిన జి నాగేశ్వరరావు, చింతపల్లికి చెందిన కుంచే రాజబాబు మోటార్‌సైకిల్‌పై వస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా 25కేజీల నల్లమందు లభ్యమైంది. దీంతో వారిని అరెస్టు చేశారు. చింతపల్లి నుంచి రాజమహేంద్రవరంనకు నల్లమందును తరలిస్తున్నట్లు వారు విచారణలో వెల్లడించారు. పట్టుబడిన నల్లమందు విలువ సుమారు రూ. 4లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు.