తూర్పుగోదావరి

రెంఢు వేల నోటు.. ముందున్నది వేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 4: పెద్ద నోట్లు రద్దయిన నాటి నుండి ప్రతిరోజూ ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చి సామాన్యుల కంటికి కునుకు లేకుండా చేస్తోంది. పరిమితికి మించివున్న బంగారానికి లెక్కలు చెప్పని పక్షంలో చిక్కుల తప్పవని ప్రకటించి కలకలం సృష్టించారు. ఈ పరిణామానికి మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త రెండు వేల నోటు తాత్కాలికమేనంటూ ప్రచారం జరుగుతోంది. 500, 1000 నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సగటు మనిషికి కొత్తగా అచ్చేసిన అతి పెద్ద 2వేల నోట్లు ప్రస్తుతం అందుతున్నాయి. ఈ నోట్లకు చిల్లర దొరక్క సామాన్యుడు చుక్కలు చూస్తున్నాడు. అయితే కేంద్రం ఓ పథకం ప్రకారం 2వేల నోట్లను ముద్రించిందని, ఆనక వీటిని రద్దు చేయడం తథ్యమంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సామాన్యులు నివ్వెరపోతుండగా బడాబాబులు బెంబేలెత్తుతున్నారు. 500, 1000 నోట్ల రద్దుతో కుబేరులందరూ 2వేల నోట్లపై పడ్డారని, అలా పడాలన్నదే ప్రథాని నరేంద్రమోదీ ఆలోచన అని బిజెపికి చెందిన ఓ నాయకుడు ఆంధ్రభూమి ప్రతినిధి వద్ద వ్యాఖ్యానించారు. ఏదో ఓ రోజు రెండు వేల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తారని, దీంతో మళ్ళీ ఆ నోట్ల మార్పిడి కోసం ప్రస్తుతం పడుతున్న పాట్లే బడాబాబులకు మరోసారి తప్పవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాత 500, 1000 నోట్లను మార్కెట్‌లో వ్యాపారులు తీసుకోవడం మానేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా వీటిని స్వీకరించడం లేదు! చెల్లని చిత్తుకాగితాలుగా మారిన ఈ నోట్లను ఇక బ్యాంకుల్లోనే అది కూడా డిసెంబరు నెలాఖరులోగా జమ చేసుకోవల్సి ఉంది. కాగా ఎవరైనా దుకాణానికి వెళ్ళి తమ వద్దవున్న 2వేల నోటు చూపిస్తే ఆ మొత్తానికి సరిపడేలా వస్తువులను కొనుగోలు చేయాలని, చిల్లర తిరిగివ్వలేమని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం కొత్త 500నోట్లు అందుబాటులోకి వచ్చివుంటే ఇన్ని సమస్యలుండేవి కాదని జనం వాపోతున్నారు. ఇక 20,50, 100 నోట్ల కొరత కూడా తీవ్రస్థాయికి చేరింది. చిల్లర లభించకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు రోజూవారీ కార్యకలాపాలను సాగించలేకపోతున్నారు. ఇదిలావుండగా సెలవు రోజు సాకుతో ఆదివారం బ్యాంకులు పనిచేయకపోవడం, ఎటిఎంలు చాలా వరకు మూతపడటంతో జిల్లాలోని ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రం కాకినాడలోని ముఖ్య కూడళ్ళలో ఆదివారం వివిధ జాతీయ బ్యాంకులకు చెందిన ఎటిఎంలు మూతపడటం గమనార్హం! ఈనెలలో శుభ కార్యక్రమాలు, వివాహాలు, గృహాల నిర్మాణాలు జరుపుకుంటుండటంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పెళ్ళిళ్ళ కోసం జాగ్రత్త చేసుకున్న లక్షల రూపాయలను బ్యాంకుల్లో మార్చుకోవాలని చూస్తే, ఇన్‌కంటాక్స్ అధికారులతో శిరోభారం తప్పేలా లేదని పలువురు వాపోతున్నారు.

సమాచారహక్కు కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదు
సమాచారహక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ తాంతియాకుమారి
గొల్లప్రోలు, డిసెంబర్ 4: ప్రభుత్వం ఉన్నత ఆశయాలతో అమల్లోకి తెచ్చిన సమాచార హక్కు చట్టం అమలు కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలపై ఎవరైనా వేదింపులు, దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ తాంతియాకుమారి అన్నారు. ఇటీవల గొల్లప్రోలులో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక మండల శాఖ అధ్యక్షుడు పడాల రతన్ భరత్ కుటుంబ సభ్యులను ఆదివారం తాంతియాకుమారి పరామర్శించారు. భరత్ మృతికి దారితీసిన కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ సమాచార హక్కు కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా లేనిపోని కేసులు పెడితే సహించేది లేదన్నారు. భరత్ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై చర్య తీసుకోవాలని కాకినాడ డిఎస్పీ వెంకటేశ్వరరావును ఆదేశించారు. స.హ చట్టం అమలుకు కృషిచేస్తున్న కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. భరత్ కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. స.హ ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు చేతన మాట్లాడుతూ భరత్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో స.హ ప్రచార ఐక్యవేదిక మహిళా విభాగం అధ్యక్షురాలు నాళం ఆండాళ్, ప్రధాన కార్యదర్శి లలితాదేవి, న్యాయ విభాగం జిల్లా కన్వీనర్ నాగబాబు, పైలా బంగార్రాజు, తటవర్తి సత్యనారాయణ, కె సతీష్, గొల్లప్రోలు మండల తాత్కాలిక అధ్యక్షుడు బుర్రా కామరాజు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు పి మహేష్, తహసీల్దార్ వై జయ, ఎస్‌ఐ బి శివకృష్ణ తదితరులున్నారు.