తూర్పుగోదావరి

ఇక గ్రేటర్ రాజమహేంద్రవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 4: రివర్ సిటీ రాజమహేంద్రవరం ఇక గ్రేటర్ నగరంగా అవతరించింది..ఇక జీవో జారీ కావడమే తరువాయిగా వుంది. మొత్తం పదమూడు గ్రామాలను విలీనం చేసుకుంటూ విస్తరిస్తోంది. భౌగోళిక స్వరూపం మారనుంది. వౌలిక సదుపాయలు విస్తరిస్తున్నాయి. నాలుగు దశాబ్ధాలుగా వున్న పాత నగరం ఇపుడు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు.
మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించడంతో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. మాస్టర్ ప్లాన్‌కు ముందు 44.5 చదరపు కిలో మీటర్లు వుండగా 162.83 చదరపు కిలో మీటర్లకు విస్తరిస్తోంది. యాభై డివిజన్ల నుంచి తొంభై డివిజన్లకు పెరగనుంది. మొత్తం తొంభై మంది కార్పొరేటర్లు రానున్నారు. విలీన గ్రామాలతో కలుపుకుని సుమారు 3.42 లక్షల జనాభా నుంచి 5.93 లక్షలకు జనాభా పెరగనుంది. ప్రధానమైన, కీలకమైన రోడ్లు 60 అడుగుల నుంచి 100 అడుగులకు విస్తరించనున్నారు. మొత్తం 22 ట్రాఫిక్ జంక్షన్లను అభివృద్ధిచేసి మొత్తం నగరమంతా ముఖ్యమైన కూడళ్లు, రహదారుల వెంట సిసి కెమెరాలను అమర్చుతారు. నగరంలోని రోడ్లను విలీన గ్రామాల రోడ్లను అనుసంధానం చేస్తూ రద్దీకి అనుగుణంగా విస్తరిస్తారు. మోరంపూడి రోడ్డు, గోదావరి బండ్ రోడ్డు, ఎవి ఎ రోడ్డు, జె ఎన్ రోడ్డు, ఆల్ బ్యాంకు కాలనీ రోడ్డు, మెయిన్ రోడ్డు, కాతేరు రోడ్డు, కోరుకొండ, పిఅండ్‌టి కాలనీ రోడ్డు, కెవి ఆర్ స్వామి రోడ్డు, అప్సర రోడ్డు, దానవాయిబాబు పుంత రోడ్డు, జెండాపంజా రోడ్డు, శీలం నూకరాజు రోడ్డు, తిలక్ రోడ్డు విస్తరించనున్నారు.
ఇపుడు నగరం భౌగోళిక స్వరూపం మారడంతోపాటు వౌళిక సదుపాలు కూడా విస్తృతంగా విస్తరించనున్నాయి. జనాభా అవసరాలకు అనుగుణంగా రోడ్లను ప్రణాళికాబద్ధంగా విశాలంగా మారనున్నాయి. ఇపుడున్న ప్రధాన ఆస్పత్రితోపాటు నగరంలో మూడు ఆస్పత్రులు, అత్యవసర చికిత్సా విభాగం, కేంద్ర నిధులతో మల్టీస్పెషాలిటీ కేన్సర్ ఆస్పత్రి, 18 ప్రసూతి విభాగాలు, 5 పబ్లిక్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి.
నగరంలో మురుగునీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇప్పటికే నగరంలో 12 ఎంఎల్ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి ప్లాంట్‌తో పాటు అదనంగా మరో మూడు మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తారు. రెండు మురుగునీటి లిఫ్ట్‌లు ఏర్పాటుచేసి గోదావరి నదిలో కలవకుండా మళ్లిస్తారు. డ్రెయిన్లను ఆధునికీకరిస్తారు. ప్రస్తుతం వున్న 630 కిలో మీటర్ల పరిధిలో వున్న డ్రెయిన్లు, 36 కిలో మీటర్ల పరిధిలోని మేజర్ డ్రెయిన్ల వ్యవస్థను పూర్తిగా ఆధునికీకరిస్తారు. మొత్తం మీద నగరం అత్యాధునిక వసతులతో ప్రణాళికాబద్ధ దీర్ఘకాలిక ప్రయోజనకరమైన అభివృద్ధికి ఆలంభనగా విస్తరించనుంది.

రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయండి
ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప
సామర్లకోట,డిసెంబర్ 4: పెద్దనోట్లు రద్దుకారణంగా ఏర్పడిన చిల్లర సమస్యల దృష్ట్యా ప్రభుత్వం ఇస్తున్న రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక కొత్తూరు రోడ్డులోవున్న రేషన్ దుకాణంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి రాజప్ప ఆకస్మికంగా తనిఖీలు చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా సరుకుల పంపిణీతీరుపై ఆయన ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సరుకుల పంపిణీలో డీలర్లు ఎటువంటి తేడాలకు పాల్పడిన సహించేది లేదని ఆయన హెచ్చరించారు. నగదు రహిత లావాదేవీలకు అనుగుణంగా ఎటువంటి ఇబ్బందులకు తావులేకుండా ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహించాలని మంత్రి రాజప్ప ఆదేశించారు. ఈ సందర్భంగా రేషన్‌షాపులో సరుకుల వివరాలను ఆయన పరిశీలించి డీలర్‌కు పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాజప్ప వెంట పట్టణ టిడిపి అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు,పట్టణ కార్యదర్శి బడుగు శ్రీకాంత్ తదితరులున్నారు.