తూర్పుగోదావరి

సేంద్రీయ ఎరువుల వాడకాన్ని అలవరచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, డిసెంబర్ 5: భూసారాన్ని పెంపొందించుకునేందుకు రైతులు సేంద్రీయ ఎరువుల వాడకాన్ని అలవరచుకోవాలని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ చేస్తున్న మట్టి నమూనాల సేకరణ ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కొత్తపేట ఎడిఎ కె బాబూరావు మాట్లాడుతూ భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే రైతులు ఎరువులు వాడాలని సూచించారు. అలాగే రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట ఎఒలు జె భార్గవ మహేష్, కెవిఎన్ రమేష్‌కుమార్, కె సునీత, వై మధుబాబు వరి సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, భూసార పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎంపిక చేసిన రైతులకు ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, డిసిఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి చేతుల మీదుగా పవర్ టిల్లర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ బండారు వెంకట సత్తిబాబు, వైస్-్ఛర్మన్ గుత్తుల ఏడుకొండలు, డిసిసిబి డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, సర్పంచ్‌లు నెక్కంటి వెంకన్న, కడలి లచ్చన్న, కుడుపూడి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం: రైతులు ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలకు తిలోదకాలిచ్చి.. గతంలో రైతాంగం నిర్వహించిన సేద్య విధానాలను అనుసరించడం ద్వారా ఆర్ధికంగా పటిష్ఠత, ఉత్పత్తుల్లో రోగ నిరోధక శక్తి పెరగడం వంటి శుభ పరిణామాలు ఉంటాయని స్థానిక శాసనసభ్యులు తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. ప్రపంచ నేల దినోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ప్రాంగణంలో వ్యవసాయ శాఖ నేతృత్వంలో నిర్వహించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విడివి రత్నకుమార్, ఎఎమ్‌సి ఛైర్మన్ గరిగిపాటి సూర్యనారాయణ మూర్తి, మండల వ్యవసాయ శాఖాధికారులు టివిఆర్ మణిదీప్, ఎన్ సత్యప్రసాద్‌లతో పాటు రెండు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రాలలో అధిక మోతాదులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటంతో భూసారం తగ్గిపోతోందని, ఉత్ఫత్తులలో నాణ్యత లోపించడం జరుగుతోందని ఎమ్మెల్యే త్రిమూర్తులు స్పష్టం చేసారు. ప్రతీ రైతు సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంల వైపు మొగ్గు చూపి, నాణ్యమైన దిగుబడులను సాధించాలని పిలుపునిచ్చారు. రైతు తన పొలంలో మట్టి నమూనాలు సేకరించి, మండల వ్యవసాయ శాఖాధికారికి అందిస్తే.. భూసార పరీక్షలు చేసి, వాటి విశే్లషణా ఫలితాలను తెలుపుతారని అన్నారు. భూభౌగోళ స్థితి సక్రమంగా ఉండేందుకు, మొక్కల్లో జీవ సంబంధ ప్రక్రియలు సమతుల్యంగా ఉండేందుకు, నేలలు సారవంతంగా కొనసాగేందుకు రైతులు గతంలో పూర్వీకులు అనుసరించిన విధానాలకు వెళ్ళక తప్పదని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
పోలీస్ క్రీడాపోటీల్లో జిల్లా క్రీడాకారుల విజయం
కాకినాడ సిటీ, డిసెంబర్ 5: ఆల్ ఇండియో పోలీస్ క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్‌టీమ్ హాండ్‌బాల్ గేమ్‌లో మెన్ అండ్ ఉమెన్ జట్లు విజయం సాధించగా, ఈటీమ్‌లో సభ్యులుగా ఉన్న జిల్లాకు చెందిన క్రీడాకారులు విజయం కేతనం ఎగరవేశారు. గతనెల 28వ తేదీ నుండి ఈనెల 2వ తేదీ వరకు విశాఖపట్టణంలో ఆల్ ఇండియా పోలీస్ క్రీడా పోటీలు జరిగాయి. రాష్ట్రం తరుపున హాండ్‌బాల్ మెన్ విభాగంలో జిల్లాకు చెందిన రామచంద్రపురం కానిస్టేబుల్ కె సుధాకర్, ఉమెన్ విభాగంలో పామర్రు మహిళా కానిస్టేబుల్ వి లావణ్యలు గోల్డుమెడల్స్ సాధించారు. అదే విధంగా వాలీబాల్ విభాగం ప్రతిభను కనబరిచిన యు కొత్తపల్లి మహిళా కానిస్టేబుల్ జి విజయలక్ష్మి, యోగా విభాగంలో ప్రతిభను ప్రదర్శించిన రంపచోడవరం మహిళా కానిస్టేబుల్ సిహెచ్‌వి ప్రభ, జగ్గంపేట మహిళా కానిస్టేబుల్ వై భవాని, రాజోలు మహిళా కానిస్టేబుల్ ఒఎస్ రాజేశ్వరిలను జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్, ఎఎస్పీ ఎఆర్ దామోదర్‌లు అభినందించారు. ఈసందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ విధినిర్వాహణలో నిత్యం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటు క్రీడల్లో సైతం వీరు విజయం సాధించడం గర్వకారణమని కొనియాడారు. వీరికి సాకాపరంగా సహకారం అందజేస్తామని, అంతే కాకుండా రివార్డులను సైతం అందజేయనున్నట్లు ఎస్పీ రవిప్రకాష్ చెప్పారు.