తూర్పుగోదావరి

డోలాయమానంలో విలీన గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 5: కోర్టు స్టేను ఆధారం చేసుకుని రాజమహేంద్రవరం విలీన గ్రామాల కార్యదర్శుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. గ్రామాలు డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మూడు వారాల కోర్టు స్టే నామమాత్రమేనని తెలుస్తోంది. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌లో విలీన గ్రామాల ప్రత్యేక అధికారిగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ను నియమించిన దరిమిలా గ్రామాల్లో కార్యదర్శుల రూపేణా కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎన్‌ఆర్‌జిఎస్ నుంచి, నామినేటెడ్ పనుల వరకు పంచాయతీ కార్యదర్శులు ఎం బుక్ చివరి పేజీలను జిరాక్స్ కాపీలతో అఫిడవిట్‌లు సమర్పించారు. ఏ పని చేయాలన్నా కమిషనర్ ఆదేశాలుంటే తప్ప కార్యదర్శులు కాలుకదపలేని స్థితిలో కోర్టును ఆశ్రయిస్తే మూడు వారాల పాటు స్టే వచ్చింది. ఈ స్టే కేవలం తాత్కాలికమే కాబట్టి ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటనే గుబులుతో కార్యదర్శులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే అన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని పరిపాలనా పరంగా కమిషనర్ ప్రత్యేక అధికారి హోదాలో తనదైన ముద్రను చూపిస్తున్నారు. ఎపుడు పంచాయతీలపై తనిఖీలు నిర్వహిస్తారో అనే భయం పట్టుకుంది. కార్పొరేషన్ నుంచి కొంత మంది అధికారులను గ్రామాలకు పంపించి ఉదయానే్న పారిశుద్ధ్యం మెరుగుపర్చే పనులను పర్యవేక్షింపజేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన తప్పులేమైనా ఉంటే స్వయంగా ఒప్పుకుంటే సరి అన్నట్టుగా కమిషనర్ చెప్పడం వంటి పనులను తట్టుకోలేక కొంతమందిని ఆశ్రయించి కోర్టుకు వెళ్లినట్టు తెలిసింది. దీనిపై కమిషనర్ ఇదేమీ శాశ్వతం కాదని, కేవియట్ పడుతుందని సంకేతాలు ఇవ్వడంతో కార్యదర్శులు త్రిశంకు స్వర్గంలో పడ్డారని తెలుస్తోంది. ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారికి కలిపి ఉన్న జాయింట్ చెక్ పవర్ అధికారాలు కూడా ప్రత్యేక అధికారి హోదాలో కమిషనర్‌కు దఖలు పడ్డాయి. ఆదరాబాదరా తయారు చేసి పంపించిన పది నెలల బిల్లులు ట్రెజరీల వద్ద తిరస్కరించారు. నామినేషన్ పనుల బిల్లులు కూడా నిలిచిపోయాయి. కాతేరు గ్రామ పంచాయతీలో రూ.కోటి 20 లక్షల గోల్‌మాల్ జరిగినట్టు విచారణలో తేలడంతో కార్యదర్శి, ఇఓపిఆర్‌డిలపై కేసులు నమోదయ్యాయి. పింఛన్లకు సంబంధించి రూ.4.70 లక్షలు స్వాహా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. గ్రామాల్లో గాడితప్పిన పాలనకు ఇదో ఉదాహరణ మాత్రంగానే చెబుతున్నారు. మిగిలిన పంచాయతీల్లో కూడా పాలన ఇందుకు భిన్నంగా లేదంటున్నారు. లే అవుట్‌లు, బహుళ అంతస్థుల నిర్మాణాల అనుమతులు జోరుగా సాగుతున్నా ఇపుడు అవన్నీ పెండింగ్‌లో పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో గాడితప్పిన పాలనను దారిలో పెట్టేందుకు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి చొరవ వల్లే ముఖ్యమంత్రి పర్యటన మరుసటి రోజే ప్రత్యేక అధికారి నియామకం జరిగిందని తెలుస్తోంది. పంచాయతీల ఆదాయం ఎంత, ఇంత వరకు ఏవేమీ ఖర్చులు చేశారు, ఎన్నింటికి బిల్లులు చెల్లించారు, ఎం బుక్ రికార్డు ఇతర వివరాలన్నీ దాపరికం లేకుండా ఇవ్వాలని కమిషనర్ ఆదేశించినట్టు తెలిసింది. ఇటువంటి పరిస్థితి కార్యదర్శులకు మింగుడుపడటం లేదంటున్నారు.