తూర్పుగోదావరి

పాడి పరిశ్రమపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మండపేట, డిసెంబర్ 17: రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై కూడ దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండపేట మండలం మారేడుబాక గ్రామ సమీపంలో గత మూడు రోజులుగా జరుగుతున్న పాలపోటీలు, పశు ప్రదర్శనలో విజేతలకు శనివారం ఆయన బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పుల్లారావు మాట్లాడుతూ దేశంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కొద్దిపాటి వెనుకబాటుతనం ఉందన్నారు. హర్యానా, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో మేలైన పశు సంపద వృద్ధి చెంది రైతులు అర్థికాభివృద్ధి సాధించారన్నారు. హర్యానా తరువాత రెండో హర్యానాగా మండపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందన్నారు. రైతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా రైతులకు అనేక సబ్సిడీలు అందచేస్తున్నామన్నారు. పశు గణాభివృద్ధికి ఒంగోలు, పుంగనూరు, గిర్ జాతి పశువులే కాకుండా మేలైన ఆవులు, గేదెలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జనాభా పెరుగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడం లేదని, దీనికి ప్రధానంగా కూలీల కొరత కారణమన్నారు. కలెక్టర్ అరుణకుమార్ మాట్లాడుతూ జిల్లాలో డెయిరీ ఉత్పత్తుల పెరుగుదలకు ప్రతి రైతు పాడి పరిశ్రమ పట్ల శ్రద్ధ వహించాలన్నారు. దీనికోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధిలో మండపేట నియోజకవర్గం ముందంజలో ఉందని, దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు రైతులు కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు, మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, యాళ్ల దొరబాబు, పడాల సుబ్బారెడ్డి, పశుగణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు మంత్రులు బహుమతులు అందించారు.
ఎన్నికలు నిజాయితీకోసమే పెద్ద నోట్లు రద్దు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల
ప్రత్తిపాడు, డిసెంబర్ 17: ఎన్నికలు నిజాయితీగా జరగాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేశారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ప్రత్తిపాడు మండలం పోతులూరు దళితవాడలో నిర్మించనున్న రామాలయ నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ జవహర్‌లాల్ నెహ్రు కాలంలోనే అప్పట్లోనే బిఆర్ అంబేద్కర్‌ను ఓడించేందుకు ఓటుకు పది రూపాయలు చెల్లించి ఓటర్లను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారన్నారు. అదే రేటు క్రమేపి వేల స్థాయికి చేరుకుందని, ఆ విధానం నిలుపుదల చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఓట్లు కొనుగోలు చేసే పార్టీల నాయకులే విమర్శిస్తున్నారన్నారు. భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికలు నిజాయితీగా జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. రాష్టవ్య్రాప్తంగా దళితవాడల్లో, సముద్రతీరాల్లో రామాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. టిటిడి యాభై శాతం, ప్రభుత్వం తరఫున మరో యాభై శాతం నిధులు వెచ్చించి ఆలయాలు నిర్మిస్తామన్నారు. ఆయా దళివాతల్లో నిర్మించే ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేందుకు అయిదువేల రూపాయల పారితోషికం చెల్లించనున్నట్టు మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, టిడిపి నాయకులు కొమ్ముల కన్నబాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త పర్వత రాజబాబు, టిడిపి నాయకుడు జల్లిగంపల ప్రభాకరరావు, పోతులూరు సర్పంచ్ సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు.
పటిష్టంగా లింగ నిర్ధారణ చట్టం అమలు
కలెక్టర్ అరుణ్‌కుమార్
ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, డిసెంబరు 17: జిల్లాలో గర్భస్థ లింగ నిర్ధారణ చట్టాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు అధికారులతో పాటు అందరూ కృషి చేయాలని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ ఆదేశించారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో శనివారం లింగ నిర్ధారణ పరీక్షలపై జ్యుడిషియల్ అధికారులు, వైద్యాధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగ నిర్ధారణ చట్టం అమలులో ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. 1994నుండి ఈ చట్టాన్ని అమలుచేస్తూ వస్తున్నామని, జిల్లాలో 326 స్కానింగ్ సెంటర్లున్నట్టు పేర్కొన్నారు. ఈ స్కానింగ్ సెంటర్లు విధిగా చట్టాన్ని అనుసరించాలని సూచించారు. చట్టాలు చేసినంత మాత్రాన సరిపోదని, వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. జిల్లాలో గతంలో కొన్ని ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ జరిపి, ఆడ పిల్ల అని తేలితే అబార్షన్లు చేసేవారన్నారు. లింగ నిర్ధారణ చట్టం అమలు కారణంగా ఇటువంటి చర్యలు తగ్గుముఖం పట్టినట్టు పేర్కొన్నారు. సమాజంలో అన్ని రంగాలలో పురుషులతో సమానంగా స్ర్తిలు ఎదుగుతున్నారన్నారు. లింగ వివక్షను తరిమికొట్టాలని కోరారు. అంతకు ముందు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ లింగ నిర్ధారణ చట్టం అమలు, బాలికా సంరక్షణకు చేపడుతున్న చర్యలను వివరించారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేసినప్పటికీ ఆడ, మగ అనే విషయాన్ని చెప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని వ్యతిరేకించినట్టు తెలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లు జిల్లాలో 392వరకు రిజిస్టర్ కాగా వివిధ కారణాలతో 66 సెంటర్లను మూసివేశారని, 326 సెంటర్లు జిల్లాలో పనిచేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రొఫెసర్ డాక్టర్ వై రమాపద్మ, ఆల్ ఇండియా ఎనస్తీషియా ఛైర్మన్ డాక్టర్ ఎస్‌ఎస్ చక్రరావు, రామచంద్రపురం సీనియర్ సివిల్ జడ్జి ప్రాసిక్యూషన్ ఉప సంచాలకుడు దుర్గాప్రసాద్, న్యాయ నిపుణులు, గైనకాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత ఉద్యోగాలకు ఇది తొలిమెట్టు
* రాజమహేంద్రవరంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
* ఉద్యోగమేళా ముగింపు సభలో వక్తలు
రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: ఉద్యోగ మేళాకు హాజరైన అభ్యర్థులు ఉన్నత ఉద్యోగానికి ఇది తొలిమెట్టుగా భావించాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఉద్యోగ మేళా ముగింపు సభ ఆర్ట్స్ కళాశాలలో జరిగింది. ఈసందర్భంగా ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎంపిక పత్రాలను అందజేశారు. ఈసభలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. మండల స్థాయిలో కూడా ఉద్యోగ మేళాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉద్యోగమేళా నూరుశాతం విజయవంతమైందన్నారు. సుమారు 95 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై 3వేల 500 మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. ఎంపి మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ ఇంతమంది నిరుద్యోగులు ఉన్నందుకు బాధపడాలో, ఉద్యోగాలు లభిస్తున్నందుకు సంతోషించాలో అర్థం కావడం లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, విభజనతో రోడ్డునపడ్డామన్నారు. రాజమహేంద్రవరంలో కనీసం 10వేల చదరపు గజాల భవనాన్ని సమకూరిస్తే కేంద్ర నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. ఈమేరకు కేంద్రమంత్రి హామీ ఇచ్చారన్నారు. అలాగే కెజి బేసిన్‌లో పెట్రోకారిడార్‌ను ఏర్పాటు చేస్తే వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఎపిలో ఉద్యోగాలు లేని యువత ఉండరాదన్నారు. ఉద్యోగమేళాలో ఉద్యోగాలు లభించని వారు నిరాశ పడాల్సిన అవసరం లేదని, 2వ జాబితాను రూపొందించి అలాంటి వారికి తగిన శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఈసందర్భంగా గోరంట్ల జోక్యం చేసుకుని ధవళేశ్వరంలో భవనం సిద్ధంగా ఉందని, నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషిచేయాలని మురళీమోహన్‌ను కోరారు. కమిషనర్ వి విజయరామరాజు మాట్లాడుతూ ప్రతీ ఏటా ఇలాంటి ఉద్యోగమేళాలను నిర్వహించాలన్నారు. విజయానికి ఈఇంటర్వ్యూలు తొలిమెట్టుగా భావించాలన్నారు. ఈసందర్భంగా గోరంట్ల, డిప్యుటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, కమిషనర్, వికాస డైరెక్టర్ జిఎన్ రావు, వివిధ కంపెనీల ప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో మేయర్ పంతం రజనీశేషసాయి, టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ, ఫ్లోర్‌లీడర్ వర్రే శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.
దివీస్ కర్మాగారం తరలించేవరకూ పోరాడాలి
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
తొండంగి, డిసెంబర్ 17: దివీస్ కర్మాగారం తరలించేందుకు ఐక్యంగా పోరాటం సాగించాలని సిపిఎం పొలీట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పిలుపునిచ్చారు. శనివారం దానవాయిపేట గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దివీస్ కర్మాగారం నిర్మాణంపై ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును బాధిత ప్రజల నుండి ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో చిన్న, సన్నకారు రైతులే తప్పా అధికంగా భూములు ఉన్నవారు లేరని, అన్ని వసతులు కలిగిన ప్రాంతమని, దివీస్ కంపెనీ ఏర్పాటువల్ల కాలుష్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో హేచరీలు అధిక సంఖ్యలో ఉండి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. దివీస్ కంపెనీ ఏర్పాటైతే హేచరీలు మూతపడి ఉపాధి కోల్పోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో దివీస్ కంపెనీ నుండి విడుదలచేసే వ్యర్ధ పదార్థాల వల్ల మత్స్యసంపద నశించి మత్యకారులకు చేపల వేటలేక వారు వీధినపడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దివీస్ కర్మాగారం తరలించేందుకు మీకు అండగా ఉండి మీ పోరాటంలో తాను భాగస్వామినవుతానన్నారు. దానవాయిపేట పంచాయతీని జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ దత్తత తీసుకొని ప్రజల కష్టసుఖాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలే తప్పా వారిని పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడు ఈ ప్రాంతం నుండే అనేక పర్యాయాలు గెలుపొంది ఆర్థిక శాఖ మంత్రిగాను, స్పీకర్ గాను అనేక ముఖ్యమైన పదవులు చేపట్టి యాదవ కులంలో పుట్టి యాదవులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వపరంగా యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, కలెక్టర్ ఎస్పీ తదితరులు ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని పక్కనపెట్టి దివీస్ యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. చట్టప్రకారం న్యాయపోరాటం చేసి ఇక్కడి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాబోయే కాలంలో దివీస్ నిర్మాణంపై కార్యాచరణ రూపొందించి దివీస్‌ను తరలించేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. దివీస్ కర్మాగారం ఏర్పడి దాని ద్వారా తయారైన మందులను కంపెనీ ఎగుమతి చేస్తే ఆ మందులపై తాము ప్రచారం చేసి అమ్మకాలు జరగకుండా చేస్తామన్నారు. దివీస్ యాజమాన్యం కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలని ఆయన సూచించారు. ఏ ప్రాంతంలోని రైతులు భూములు అమ్మకపోయినా బలవంతంగా లాక్కుని ఆ భూముల్లో చెట్లు తొలగించడం తగదన్నారు. బలవంతంగా రైతుల నుండి తీసుకున్న భూముల్లో చెట్లు తొలగించిన వాటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిపిఎంఎల్ నాయకుడు జె వెంకటేశ్వర్లు, జనశక్తి నాయకుడు కె వీరాంజనేయులు, బి కామేష్, బి రాజబాబు, దుర్గాప్రసాద్, కె శ్రీనివాస్, సింహాచలం, దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మట్ల ముసలయ్య, యనమల నాగేశ్వరరావు, సత్యవేణి, అంగుళూరి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
రామచంద్రపురం/మండపేట, డిసెంబర్ 17: శాంతిభద్రతల విషయంలో విఘాతం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా, ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. మండపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిర్మితమైన తాత్కాలిక భవనాన్ని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మకాయల చినరాజప్ప సంయుక్తంగా శనివారం రాత్రి ప్రారంభించారు.