తూర్పుగోదావరి

ఆశలన్నీ ఫైబర్ గ్రిడ్‌పైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 20: ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి నాంది పలకనుండటంతో సేవల కోసం పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫైబర్ గ్రిడ్‌ను సంక్రాంతి నుండి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సేవలు అవసరమయ్యాయి. ప్రతి ఇంటికి ఓ టెలివిజన్, టెలీఫోన్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఫైబర్ గ్రిడ్ ద్వారా కేవలం రూ.149కి హైస్పీడ్ ఇంటర్నెట్ సహా టెలివిజన్ ప్రసారాలు, టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో ఆయా వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.
ఫైబర్ గ్రిడ్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని టెలికం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందుకు అవసరమైన సెట్‌టాప్ బాక్స్‌లను అధికారులు సిద్ధంచేస్తున్నారు. దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల నుండి ఈ బాక్స్‌లను కొనుగోలుచేస్తున్నారు. తొలి దశ కింద నెల రోజుల్లో లక్ష ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా టివి, టెలీఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ (15ఎంబిపిఎస్) ఇవ్వనున్నారు. ఇందుకు వినియోగదారులు నెలకు కేవలం రూ.149 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు సంస్థలు ఇష్టానుసారం కేబుల్ లైన్లు వేయకుండా ఉండేలా ప్రభుత్వం ఆంక్షలు విధించనుంది. ఇకపై ఫైబర్ గ్రిడ్ లైన్ నుండి మాత్రమే కనెక్షన్లు తీసుకునే విధంగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. టీవీ ఛానెళ్ళ ప్రసారాలు మాత్రమే కాకుండా ఫైబర్ గ్రిడ్ అందించే యాప్ ద్వారా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలపై లఘు చిత్రాల ప్రదర్శన ఉంటుంది. బంధుమిత్రులతో ఉచితంగా వీడియో కాల్స్‌లో మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ఎపి యాప్ స్టోర్ ద్వారా ఇంటర్నెట్‌ను టీవీకి కనెక్ట్ చేయడం ద్వారా టీవీనే కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకునే వీలుంటుంది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ తీసుకున్న వారందర్నీ ఒక బృందంగా పరిగణిస్తారు. ఈ బృందం సభ్యులు ఒకరితో ఒకరు రాష్ట్రంలో ఎక్కడినుండైనా, ఎవరితోనైనా, ఎంతసేపైనా ఇంటర్‌కం తరహాలో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ నంబర్లు 72తోను, 50నుండి 59వరకు ఉన్న సంఖ్యల సిరీస్‌తో ప్రారంభమవుతాయి. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రసారాల్లో 250వరకు ఛానెళ్లు వస్తాయి. హిందీ, ఇంగ్లిష్‌తో పాటు స్పోర్ట్స్ ఛానెళ్లను సైతం ప్రసారం చేయనున్నారు. అలాగే 30రకాల తెలుగు ఛానెళ్ళు ప్రసారమవుతాయి. టీవీల ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ఆన్‌లైన్ కోర్సులు, స్టడీ మెటీరియల్స్, ఇంకా వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రసారమవుతాయి. ఇంటర్నెట్‌ను 15 ఎంబిపిఎస్ వేగంతో 5జిబి వరకు వాడుకునే వీలుంది. 5జిబి కంటే ఎక్కువ వాడేవారు మరో ప్లాన్‌ను తీసుకోవల్సి ఉంటుంది.
ఇదిలావుండగా ఫైబర్ గ్రిడ్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఒక రోల్ మోడల్‌గా నిలువనుంది. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌ను పూర్తిస్థాయి వాణిజ్య సంస్థగా మార్చి, మిగిలిన రాష్ట్రాలకు సైతం విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఫైబర్, క్లౌడ్, టవర్ ఈ మూడు మేనేజిమెంట్లను ఒకే కనెక్షన్ ద్వారా అందించడంలో ప్రభుత్వం సఫలమయ్యింది. క్లౌడ్ డేటాను ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా గుర్తించారు. ఆప్టిక్ ఫైబర్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి నిక్సీ అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకువస్తుండటంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

కాకినాడ బీచ్‌లో సైనిక, నౌకాదళ విన్యాసాలు
కాకినాడ రూరల్, డిసెంబర్ 20: కాకినాడ బీచ్‌లో ఆర్మీ-నావీ సైనికుల విన్యాసాలకు రోడ్డుపై వెళ్లే జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఆ తర్వాత అది సైనికుల శిక్షణలో భాగమని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఐఎన్‌ఎస్-జలాశ్వ, ఐఎన్‌ఎస్-ఘాటియాల, ఐఎన్‌ఎస్-జాతా యుద్ధనౌకలలో పనిచేసే సైనికులకు శత్రువులను ఏ విధంగా ఎదుర్కోవాలో కాకినాడలో మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు కెప్టెన్ టివి సునీల్ తెలిపారు. ఐఎన్‌ఎస్ జలాశ్వలో 700 మంది, గడియాలలో 450, జాతాలో 200 మంది సైనికులు పనిచేస్తూ ఉంటారని, తొలిరోజు 250 మందికి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. యుద్ధ ట్యాంకర్లు, అవి సముద్రంలో తీసుకువెళ్లే పడవలు, సైనికులు భారీ ఆయుధాలతో నిజంగా యుద్ధం జరుగుతోందా అన్న అనుభూతిని కల్గించారు. ఈ శిక్షణలో లెఫ్టినెంట్ కమాండర్ లలిత్ సింగ్, కమాండర్ భట్టచార్య తదితరులు పాల్గొన్నారు.