తూర్పుగోదావరి

హామీలు నెరవెర్చేవరకూ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, డిసెంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చే వరకూ కాపు ఉద్యమం కొనసాగుతుందని రాష్ట్ర కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. బొలిశెట్టి సత్యనారాయణమూర్తి అనే అభిమానిని పరామర్శించడానికి వచ్చిన ఆయన మలికిపురంలో కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు. డిసెంబర్ 30వ తేదీన రాష్టవ్య్రాప్తంగా ఉన్న చట్టసభల ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాల సమర్పణ, జనవరి 9న సాయంత్రం సమయంలో కొవ్వొత్తుల ర్యాలీ, జనవరి 25న పాదయాత్ర నిర్వహణ అనే మూడు అంచెలుగా తమ ఉద్యమం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. మహిళలు కూడా ఉద్యమానికి సహకారం అందిస్తామని ప్రకటించడంతో జనవరి 5న కాకినాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా ప్రతినిధులతో సమావేశం నిర్వహస్తామని ఆయన తెలిపారు. కాపులను బిసిల్లో చేరుస్తామని, కాపు కార్పొరేషన్‌కు 1000 కోట్లు మంజూరు చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. బిసి సోదరుల రిజర్వేషన్లకు ఆటంకం లేకుండా జనాభా ప్రాతిపదికన కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు అన్ని విషయాల్లోను అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చి తమ ఆకలి కేకలను తీర్చాలని పద్మనాభం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, కాపు ఉద్యమ నాయకులు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, కూనపురెడ్డి రాంబాబు, సత్తిబాబు, మంగిన నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.