తూర్పుగోదావరి

డీలాపడిన కేడర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 9: జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్ పూర్తిగా డీలా పడింది. ఈ రెండు నియోజవర్గాల్లో నెలకొన్న రాజకీయం జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావానే్న చూపిస్తోంది. వైసిపి శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఇదే విషయమై ఇపుడు విస్తృత రీతిలో చర్చ జరుగుతోంది. జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ఐదుగురు శాసనసభ్యుల్లో ఇరువురు అధికార తెలుగుదేశం పార్టీలో చేరిక కారణంగా ప్రతిపక్షానికి శరాఘాతంగా పరిణమించింది. ఈ నెల 8న తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పచ్చ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే! మరో ముఖ్యనేత, జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) ఈ నెల 11న తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు. ఇరువురి ఫిరాయింపుతో వైసిపి కేడర్ జిల్లాలో డీలా పడింది. ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలు మెట్టలో కీలకమైనవి కావడం, వైసిపికి నిన్న మొన్నటి వరకు బలమైన నాయకుడిగా కొనసాగిన నెహ్రూ ఒక్కసారిగా పార్టీ ఫిరాయించడంతో వైసిపి వర్గాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఈ విషయంలో నేతల కంటే కార్యకర్తలే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు నియోజకవర్గాల్లో వైసిపికి చెందిన కేడర్ దాదాపు ఫిరాయింపు నేతల వెంట నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుబ్బారావుకు కొంతవరకు వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ, నెహ్రూ విషయంలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. జగ్గంపేటలో వైసిపి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు జడ్పీటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, వివిధ సొసైటీల అధ్యక్షులు, సభ్యులు జ్యోతుల వెంటే నడిచేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లో జ్యోతుల, వరుపులకు ప్రత్యామ్నాయ నాయకత్వం తయారుగా లేకపోవడం ప్రతిపక్ష పార్టీకి మరో మైనస్‌గా మారింది. ద్వితీయ శ్రేణి నాయకులను మాత్రమే ఇపుడు ఈ రెండు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలుగా సిద్ధం చేసుకోవల్సి వస్తోంది. ఇదిలావుండగా జ్యోతుల రంగప్రవేశం అనంతరం అధికార తెలుగుదేశంలోకి మరో ఎమ్మెల్యే జిల్లా నుండి జంప్ కావడం తథ్యమన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రాష్ట్ర స్థాయిలో చర్చలు, సంప్రదింపులు ఒక కొలిక్కి రాకపోవడంతో సదరు ఎమ్మెల్యే జంప్ జిలానీ అవతారం ఎత్తేందుకు జంకుతున్నట్టు తెలిసింది. సదరు ఎమ్మెల్యే కూడా అధికార టిడిపిలో చేరిన పక్షంలో జిల్లాలోని మెట్ట ప్రాంతం యావత్తూ పచ్చ జెండాలతో కళకళలాడుతుందన్న ఆనందంతో టిడిపి శ్రేణులున్నాయి. జ్యోతుల నెహ్రూ చేరిక అనంతరం ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం!