తూర్పుగోదావరి

80శాతం పూర్తయన మంజునాథ కమిషన్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, జనవరి 3: కాపులకు బిసి రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం నియమించిన మంజునాధ కమీషన్ సర్వే 80శాతం పూరె్తైందని, ఏమైన సమస్యలుంటే కమీషన్‌కు చెప్పుకోవాలని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. మంగళవారం సామర్లకోట టిటిడిసిలో రుణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేస్తున్న మంత్రి రాజప్పకు పెద్దాపురం నియోజవకర్గం పరిధిలో కాపు సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి రాజప్ప మాట్లాడుతూ మంజునాధ కమిషన్ సామర్లకోట వస్తుందని, ఇబ్బందులంటే కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కాపు నేతలు మలకల చంటిబాబు, జిగిని రాజుబాబు, ఎవి సూర్యనారాయణ, ముసిరెడ్డి వీరభద్రరావు పాల్గొన్నారు.

రేపు ముఖ్యమంత్రి రాక

కాకినాడ, జనవరి 3: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 5న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసు బలగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాయి. రామచంద్రపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. మావోయిస్ట్‌లు ముఖ్యమంత్రిని అటాక్ చేసే అవకాశాలున్నట్టు ఇటీవల ఇంటెలిజన్స్ వర్గాల నుండి వచ్చిన హెచ్చరికల మేరకు పోలీసులు జిల్లాను జల్లెడ పడుతున్నారు. రామచంద్రపురం, పిఠాపురం ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభాస్థలి, పర్యటించే ప్రాంతాల్లో వందల సంఖ్యలో పోలీసులను మొహరిస్తున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలున్న ఎస్‌ఇజడ్ వ్యతిరేక పోరాట సమితీ ప్రతినిధులు, నిర్వాసితులు, దివీస్, పోర్టు వ్యతిరేక, ఆందోళనకారులను ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకోనున్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన వివరాలిలా ఉన్నాయి. ఈనెల 5న ఉదయం 9.55 గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో ముఖ్యమంత్రి రామచంద్రపురం చేరుకుంటారు. ఇక్కడి బైపాస్ రోడ్‌లోని హెలీప్యాడ్ నుండి రోడ్డు మార్గంలో పట్టణంలోని ఆర్‌డిఒ కార్యాలయానికి చేరుకుంటారు. కొత్త ఆర్‌డిఒ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన తర్వాత ఆర్‌డిఒ క్యాంపు కార్యాలయం, స్ర్తిశక్తి భవనాలను ప్రారంభిస్తారు. కోరంగి కెనాల్‌పై నిర్మించిన వంతెనను ప్రారంభించి, కాజులూరు మండలంలోని జగన్నాధగిరి వద్ద పంచాయతీరాజ్ రహదారులను ప్రారంభిస్తారు. చప్పిడివారి సావారంలో నిర్మించిన ఓపెన్ ఆడిటోరియంను ప్రారంభిస్తారు. ఉదయం 11నుండి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య పట్టణంలోని 19వ వార్డులో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రామచంద్రపురంలో హెలీకాప్టర్‌లో బయలుదేరి పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురంలోని జగ్గయ్యచెరువు వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు పుష్కర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 3గంటలకు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు పిఠాపురం నుండి హెలీకాప్టర్‌లో మధురపూడి విమానాశ్రయం చేరుకుని, ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్తారు.