తూర్పుగోదావరి

కాపు రిజర్వేషన్ల సాధన కోసం కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 9: కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండు చేస్తూ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన దశలవారి ఆందోళనల్లో భాగంగా సోమవారం సాయంత్రం అమలాపురంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తొలుత గండు వీధిలోని కాపు రిజర్వేషన్ పోరాట సమితి కన్వీనర్, దివంగత నల్లా సూర్యచంద్రరావు విగ్రహానికి పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాగడాలు, కొవ్వొత్తులు చేతబూని ర్యాలీగా గడియార స్తంభం వద్దకు చేరుకుని ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యారంగాల్లో చీకట్లో ఉన్న మా కులాలకు రిజర్వేషన్ కోరుతూ ఈ పోరాటం నిర్వహిస్తున్నామన్నారు. తమ న్యాయమైన కోరికలను తీర్చేంతవరకూ దశల వారీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా కాపు యువత నినాదాలు చేశారు. ఆకలి మంటలతో ఉన్న కాపు యువత ఆగ్రహాన్ని చవిచూడరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర జెఎసి నాయకులు నల్లా పవన్, కంచిపల్లి అబ్బులు, మామిడిపల్లి రాంబాబు, చిక్కం సూరిబాబు, మామిడిపల్లి శ్రీను, పోలిశెట్టి కిట్టయ్య , బసవా సూర్యచంద్రరావు, బండారు రామోహనరావు, సత్తి బాపూజీ, సూదా గణపతి, అరిగెల పుల్లయ్యనాయుడు, వంటెద్దు బాబి, గోకరకొండ గంగన్న, మామిడిపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
మండలానికి రెండు నగదు రహిత గ్రామాలు
ఆసుపత్రి ప్రసవాలకు రూ. 6 వేలు: కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ, జనవరి 9: జిల్లాలో నగదు రహిత లావాదేవీల ప్రోత్సహంలో భాగంగా తొలి దశలో జిల్లాలోని మండలాలకు రెండు గ్రామాలు ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సూచించారు. సోమవారం కలెక్టర్ తన కోర్టుహాలులో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల్లో నగదు రహిత గ్రామాలును గుర్తించి ఆ గ్రామాలకు ఆధార్ అనుసంధానం, బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలన్నారు. జననీ సురక్ష యోజన కింద ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవానికి వెయ్యి స్ధానంలో ఆరువేలు అందించే నూతన పధకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పధకం త్వరలో అమలు కానుందన్నారు. అనంతరం జిల్లాలో ఎస్సీ కార్పొరేషనఇ, బిసి కార్పొరేషన్ పధకాలు, ధాన్యం కొనుగోళ్ళు, ఉద్యానవన శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సమావేశంలో జెసి ఎస్ సత్యనారాయణ, జెసి-2 జె రాధాకృష్ణమూర్తి, డిఆర్‌డిఎ పిడి ఎస్ మల్లిబాబు, డ్వామా పిడి ఎ నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ సిఇఓ కె పద్మ, పిఆర్ ఎస్‌ఇ వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.