తూర్పుగోదావరి

సంక్రాంతి ఛార్జీల మోత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 9: సంక్రాంతి చార్జీల మోత మొదలైంది..ప్రైవేటు, ఆర్టీసీ యాజమాన్యాలు సంక్రాంతికి ప్రయాణీకులపై అదనపు చార్జీల వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. అసలే పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ఇపుడు అదనపు ఛార్జీల వల్ల చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లలేని స్థితి నెలకొందంటున్నారు. గత ఏడాది తత్కాల్, ఫ్లాట్ పాం చార్జీలను మాత్రమే పెంచిన రైల్వే శాఖ సంక్రాంతిని పురస్కరించుకుని ఈసారి ఛార్జీలు పెంచకపోయినప్పటికీ ప్రత్యేక రైళ్లను తగినన్ని ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణీకుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. అపుడే రైళ్లల్లో సంక్రాంతి రద్దీ పెరిగింది. తగినన్ని రైళ్ళు లేకపోవడంతో సంక్రాంతి ప్రయాణీకులు అనివార్యంగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేటు బస్సు యాజమాన్యాలు రద్దీకి అనుగుణంగా ఛార్జీల మోత మోగించేందుకు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి సుమారు రెండు వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రూ. రెండు వేల నోటుకు చిల్లర తిరిగి ఇచ్చే విధంగా ఎక్కడా ఛార్జీలు లేవని అంటున్నారు. ఈ నెల 11, 12, 16, 17 తేదీల్లో జిల్లా నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, విజయవాడ, తిరుపతి వెళ్లే ప్రయాణికుల సంఖ్య అధికంగా కన్పిస్తోంది. దీంతో ప్రైవేటు బస్సు యాజమాన్యాలు ఇదే అదనుగా ఛార్జీలు పెంచేశారంటున్నారు. ఈ తేదీల్లో టిక్కెట్లన్నీ ఎపుడో బుక్ అయిపోయాయని చెప్పి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ డీలక్స్ బస్సు చార్జీ రూ.555లు కాగా సంక్రాంతి స్పెషల్ బస్సు పేరుతో అదే దూరానికి రూ.825లు వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ చార్జి రూ.590 వుండగా, అది కాస్తా రూ.890 వసూలు చేస్తున్నారు. ఇంద్ర బస్సు చార్జీ రూ.775 కాగా సంక్రాంతి సందర్భంగా రూ.1100లకు పెంచారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు ఎక్స్‌ప్రెస్ చార్జీ రూ.175 కాగా ప్రస్తుతం రూ.260 వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ చార్జీ రూ.201, దీనిని రూ.360 వసూలు చేస్తున్నారు. గరుడ చార్జీ రూ.323 వుండగా రూ.500 వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఈ నెల 10న ఐదు ప్రత్యేక బస్సులు, 11న 9 బస్సులు, 12న 19 బస్సులు, 13న 5 బస్సులు వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. దూరాన్ని, ఖాళీలను బట్టి ఈ చార్జీలను వసూలు చేస్తున్నామని, ప్రజలపై భారాలు మోపేందుకు కాదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతికి హైదరాబాద్‌కు మాత్రమే ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, మిగిలిన ప్రాంతాలకు యధావిధిగా బస్సులు నడుపుతున్నామని అధికారులు చెబుతున్నారు.
కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు!

కాకినాడ, జనవరి 9: పెద్దనోట్లను రద్దు చేసి రెండు నెలలు పూర్తయినా జిల్లా ప్రజల కరెన్సీ కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. 2016 నవంబర్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం 500/1000 నోట్లను రద్దు చేసింది మొదలు జిల్లాలో ప్రారంభమైన చిల్లర కష్టాలు మూడవ నెలలోకి అడుగిడినా సామాన్యుడిని వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రం కాకినాడ, రాజమహేంద్రవరం సహా అన్ని పట్టణాలు, డివిజన్, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ సుమారు 80 శాతం ఎటిఎంలు అలంకార ప్రాయంగానే కనిపిస్తున్నాయి. పరిమితమైన ఎటిఎంలలో నగదు విత్‌డ్రాకు వెళ్తే 2000 నోట్లు మినహా చిల్లర గగన కుసుమంగానే మారింది. అయితే కొత్త 500 నోట్ల రాకతో పరిస్థితిలో కొంతవరకు మార్పు వచ్చినప్పటికీ ప్రజలకు చిల్లర కష్టాలు మాత్రం తీరలేదు! చిల్లర కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న ఆయా వర్గాల ప్రజలు చివరకు పండుగ, పబ్బాలకు దూరమయ్యారు. మునుపెన్నడూ లేని రీతిలో ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు పేలవంగా జరగడమే ఇందుకు ఉదాహరణ! ఇక ఈ సంక్రాంతి పండుగకు సామాన్యుడి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 60శాతం కుటుంబాలు సంక్రాంతి పండుగకు సంబంధించి ఏ ఒక్క కార్యక్రమాన్నీ పూర్తిచేసుకోలేని దుస్థితిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు! ఏటా మాదిరిగా ఇంటా, బయటా చక్కబెట్టాల్సిన అనేక పనులు పెండింగ్‌లో ఉండిపోగా, పలువురు సంక్రాంతి సంబరాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో నగదు ఉండి కూడా సకాలంలో చేతికందక అగచాట్లు తప్పలేదని, చిత్రమైన ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నామని పలువురు వ్యాఖ్యానించారు. జిల్లాలో వ్యాపార సంస్థల పరిస్థితి కూడా ఇదే రీతిలో ఉంది. ఏ ఒక్క వ్యాపార వర్గానికీ కొత్త సంవత్సర ఆరంభం కలసి రాలేదు! అలాగే వాహనాల కొనుగోళ్ళు, బంగారం, వెండి, వస్తవ్య్రాపార రంగంపై పెద్దనోట్ల రద్దు తీవ్ర ప్రభావానే్న చూపింది. మరోవైపు జిల్లాలో నగదు రహిత కార్యకలాపాలను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం వేగవంతం చేస్తోంది. ప్రతివొక్క దుకాణదారుడు విధిగా పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలను కలిగివుండేలా ప్రోత్సహిస్తోంది. మొబైల్స్, ఎటి ఎం , డెబిట్/క్రెడిట్ కార్డులు, చెక్‌ల రూపంలో లావాదేవీలను ప్రోత్సహించాల్సిందిగా బ్యాంకర్లకు ప్రభుత్వ యంత్రాంగం పదే పదే సూచిస్తోంది. బ్యాంకర్లు కూడా నగదు రహిత లావాదేవీలపైనే దృష్టి సారించకతప్పలేదు! పెద్దనోట్ల రద్దుతో తాము అనేక కష్టాలు పడుతుంటే, జిల్లాలోని పలువురు బడాబాబులు, ధనికులు మాత్రం ఎప్పటిలాగే హాయిగా తమ పనులు తాము చేసుకుంటున్నారని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
హామీల అమలుపై శే్వతపత్రం ప్రకటించాలి
వైసిపి జిల్లా అధ్యక్షుడు కన్నబాబు : భారీగా తరలివచ్చిన పార్టీ యువశ్రేణులు
కాకినాడ, జనవరి 9: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిందని అవి ఎంతవరకు అమలు చేశారో బహిరంగంగా శే్వతపత్రాన్ని విడుదల చేణాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా వైకాపా యువజన విభాగం ఆధ్వర్యంలో ఉద్యోగ పోరు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వైకాపా శ్రేణులు అధికస్ధాయిలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన కన్నబాబు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తాదని హామీ ఇచ్చారని, అంది ఎంత వరకు అమలు చేశారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి అధికారంలోకి వచ్చి 32 నెలలైందని ఈ కాలంలోని నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత జాబులు పోయిన వారికి వేతనాన్ని చెల్లించాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు చెప్పి అధికారం దక్కించుకున్న చంద్రబాబు జీరోగా నిజాలు చెప్పి జగన్ ప్రజల దృష్టిలో హీరోగా నిలిచారన్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తానని చెప్పి యువతను, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాని మహిళలను బాబు మోసం చేశారన్నారు. రానున్న కాలంలో యువత టిడిపి ప్రభుత్వ వైఖరిపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పినిపే విశ్వరూప్, ముత్తా శశిధర్, రౌతు సూర్యప్రకాశరావు, కందుల దుర్గేష్, పెండెం దొరబాబు, ముత్యాల శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, పర్వత ప్రసాద్, తోట సుబ్బారావు నాయుడు, అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు, మేడపాటి షర్మిళ, జక్క పూడి విజయలక్ష్మి, ఆర్‌విజెఆర్ కుమార్, మిండగుడితి మోహన్ తదితరులు పాల్గొన్నారు.