తూర్పుగోదావరి

మన్యంలో మరో శిశుమరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జనవరి 12: రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి కామినేని ఏజెన్సీలో నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పిన మరునాడే శిశుమరణం చోటుచేసుకుంది. ఏజెన్సీలో వైద్య సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని, మరణాలు తగ్గుతున్నాయని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం కనిపించడంలేదు. మండలంలో మారుమూలన ఉన్న లోదొడ్డి పంచాయతీ కేశవరం గ్రామానికి చెందిన మేలిన వీరలక్ష్మికి జన్మించిన మూడునెలల మగబిడ్డ కాకినాడ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. రెండురోజుల క్రితం పసిబిడ్డకు తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో అల్లాడిపోతుండగా తల్లిదండ్రులు ఏలేశ్వరం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ బిడ్డ ఆరోగ్యం కుదురుపడకపోగా మరింత విషమంగా మారడంతో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించామని, అయినా సరే బిడ్డ ప్రాణం దక్కలేదని తొలి కాన్పులో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగునెలల క్రితం వీరలక్ష్మి గర్భిణీగా ఉన్న సమయంలో తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతుండగా కాకినాడ జనరల్ ఆసుపత్రిలోనే పురుడు పోసుకుంది. దీనితో మండలంలో మూడునెలల వ్యవధిలో మరణించిన శిశువుల సంఖ్య 17కు చేరుకుంది. శిశుమరణాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలని గిరిజన సంఘాలు గత ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్నా ఎటువంటి ఫలితాలు కనిపించడంలేదు. మన్యంలోని గ్రామాల్లో ఎన్ని వైద్యశిబిరాలు ఏర్పాటుచేసినా నిష్ప్రయోజనంగానే మారుతున్నాయని చెప్పవచ్చు. అన్ని మండలాల కంటే రాజవొమ్మంగి మండలంలోనే ఎక్కువగా మరణాలు సంభవించడంతో బిడ్డల తల్లులు తీవ్రంగా భయపడుతున్నారు.

25 నుంచి కాపు సత్యాగ్రహ యాత్ర
-క్రమశిక్షణతో మెలగాలి:ముద్రగడ-
ప్రత్తిపాడు, జనవరి 12: బలిజ, తెలగ, ఒంటరి, కాపు జాతికి బిసి రిజర్వేషన్ పునరుద్ధరిస్తానని ఎన్నికల్లోను, పాదయాత్రలోను చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయమని ఈ నెల 25వ తేదీ నుండి రావులపాలెం నుండి అంతర్వేది వరకు కాపు సత్యాగ్రహ యాత్ర నిర్వహించనున్నట్టు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనే కోనసీమ సమీప గ్రామాల కాపు సోదరులు తమ ఏర్పాట్లు తామే చేసుకుని సహకరించాలని ఆయన కోరారు. గాంధీ మార్గంలో చేసే ఈ పాదయాత్రలో జాతి సోదరులెవరూ అల్లర్లు చేయకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. పాదయాత్ర చేసేది తమ జాతికి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయమనేకాని, ఇతర కులాలపై పోరాటానికి మాత్రం కాదని ముద్రగడ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.