తూర్పుగోదావరి

కోడి పందాలకు కోనసీమ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జనవరి 12: కోడి పందాల నిర్వహణకు కోనసీమ రెడీ అయిపోయింది. కోర్టు తీర్పులు, పోలీసుల హెచ్చరికలను పక్కనపెట్టి వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్‌ల పేరుతో బరులను సిద్ధం చేసేశారు. పందాలు నిర్వహించే ప్రాంతాలను చదునుచేసి అందంగా తీర్చిదిద్దడమే కాకుండా పందాలను చూసేందుకు వచ్చేవారి తాకిడిని తట్టుకునేందుకు బారికేడ్లను ఏర్పాటుచేశారు. పందాలను వీక్షించేందుకు వచ్చేవారి కోసం టెంట్లు వేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికోసం వసతి సౌకర్యాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అయితే పందాలు నిర్వహించే ప్రాంతాలకు మీడియా, పోలీసులు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కోనసీమలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ, అల్లవరం మండలంలోని గోడి, కాట్రేనికోన మండలంలోని కాట్రేనికోన, చెయ్యేరు, ముమ్మిడివరం మండలంలోని రాజుపాలెం, పల్లిపాలెం ప్రాంతాల్లో పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు గత వారంరోజులుగా పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చేస్తున్న హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్వాహకులు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారంటే వారి వెనుక ఉన్న రాజకీయ అండ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఆరునూరైన పండగ మూడురోజులు కోడి పందాలు నిర్వహించి తీరుతామని ఇప్పటికే నిర్వాహకులు బాహాటంగానే చెపుతున్నారు. దీనిపై డిఎస్పీ ఎల్ అంకయ్యను వివరణ కోరగా సంక్రాంతి పేరుతో నిర్వహించే అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటామన్నారు. ఇప్పటికే కోనసీమలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి పందాలు నిర్వహిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
గోడిలో బరులు సిద్ధం
అల్లవరం: సంక్రాంతి సందర్భంగా పండుగ మూడు రోజులు మండలంలోని గోడి గ్రామంలో కోడి పందాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమయ్యింది. వైనతేయ గోదావరి ఒడ్డున కోడి పందాలు నిర్వహించేందుకు గురువారం బరులు సిద్ధం చేసి టెంట్లు వేశారు. ఇప్పటి వరకూ కోడి పందాలు నిరోధించేందుకు పోలీసులు యంత్రాంగం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరి ఏ నమ్మకంతో నిర్వాహకులు టెంట్లువేసి కోడిపందాలు నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారో పోలీసులకే అంతుపట్టడం లేదు. కోడిపందాల ప్రాంతంలో గుండాటలు నిర్వహించేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు. పందాలు నిర్వహించే బరుల చుట్టూ సర్వే కర్రలతో బారికేడ్లు ఏర్పాటుచేశారు. కోడి పందాలను నిరోధించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తుండగా కోర్టు ఆదేశాలను కూడా లెక్కచేయకుండా పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయంటే దీని వెనుక రాజకీయ నాయకుల అండ బలంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.