తూర్పుగోదావరి

ఆశ్రమ పాఠశాలలో గడువు ముగిసిన పాల ప్యాకెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విఆర్ పురం, ఫిబ్రవరి 2: మండల పరిధిలోని రాయిగూడెం ఆశ్రమ పాఠశాలలో గడువు ముగిసిన పాల ప్యాకెట్లు ఉండటం చూసిన చింతూరు ఐటిడిఎ పిఒ చినబాబు, ఇలాంటి గడువు ముగిసిన సరుకులు మళ్లీ కనబడితే సస్పెండ్ చేస్తానని హెచ్‌ఎంని మందలించారు. గురువారం పిఒ గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేయకపోవటాన్ని గుర్తించారు. అలాగే స్టోర్‌రూమ్‌లోని సరుకుల నిల్వలను పరిశీలించారు. మెనూ ప్రకారం వంటలు చేయాలని, సరుకులు, పాల ప్యాకెట్ల మీద ఉన్న గడువు తేదీలను చూసుకుని వాటిని వాడాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంను పిఒ హెచ్చరించారు.

వచ్చే కేబినెట్ సమావేశంలో
ప్యాకేజీకి చట్టబద్ధత అంశం
-బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 2: ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దతకు సంబంధించి వచ్చే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రతిపాదన పెడతారని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెప్పారు. కేంద్ర బడ్జెట్ ఉజ్వల భవిష్యత్తుకు దర్పణమన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న డిమాండును విలేఖర్లు ప్రస్తావించగా ఆయన పైవిధంగా పేర్కొన్నారు. ప్యాకేజీలో భాగంగా రాష్ట్రానికి ఏటా రూ.3800 కోట్ల నిధులు మూడేళ్లపాటు మంజూరవుతాయన్నారు. ఫ్యూచర్ అనే ఇంగ్లీషు పదంలోని అన్ని అక్షరాల అర్ధాన్ని బట్టి నిధులు కేటాయించారని భాష్యం చెప్పారు. రైతులకు రూ.10 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక ముదావహమన్నారు. రాష్ట్రంలో 200 అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరిగిందన్నారు. రాష్ట్ర రైల్వేలకు గత బడ్జెట్‌లో రూ.2300 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.3,500 కోట్లు కేటాయించారన్నారు. తమ పార్టీ నేత రాంమాధవ్ కృషివల్ల కోటిపల్లి-అమలాపురం రైల్వే లైన్‌కు రూ.50 కోట్లు కేటాయించారన్నారు. నర్సాపురం భీమవరం, మచిలీపట్నం, గుడివాడ డబ్లింగ్‌కు రూ.90 కోట్లు కేటాయింపు జరిగిందన్నారు. కొవ్వూరు-్భద్రాచలం లైన్‌కు సాంకేతిక మంజూరు లభించిందన్నారు.