తూర్పుగోదావరి

నిలిచిపోయిన ఇసుక రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి గన్నవరం, ఫిబ్రవరి 27: కూలి రేట్లు పెంచేంతవరకూ ఎగుమతి చేసేది లేదంటూ జట్టు సంఘాలు భీష్మించడంతో డిఎస్ పాలెం (పి గన్నవరం) ఉచిత ఇసుక ర్యాంపు రవాణా సోమవారం నిలిచిపోయింది. ప్రజల అభీష్టం మేరకు ఎమ్మెల్యే పులపర్తినారాయణమూర్తి డిఎస్ పాలెం ఉచిత ఇసుక ర్యాంపునకు ప్రభుత్వ అనుమతిని తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ నెల 22వ తేదీన అధికారులు ఉచిత ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ఇసుక ట్రాక్టర్ ఎగుమతికి 175 రూపాయలు, ర్యాంపు నిర్వహణకు 125 రూపాయలు ప్రభుత్వం ధరలను నిర్దేశించడంతో దాని ప్రకారం ట్రాక్టర్ ఒక్కింటికి 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాగా మరో రూ.200లను ప్రైవేటు వ్యక్తులు వసూలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రైవేటు వసూళ్ల నిలుపుదలకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ఎగుమతికి 175 రూపాయలు మాత్రమే ఇస్తామని, ఇష్టమైతే తీయ్యండి లేకపోతే మానేయండని ర్యాంపు నిర్వాహకులు అనడంతో గిట్టుబాటు కాదని జట్టు కార్మికులు వెనుదిరిగారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి జట్టు కూలీలు చేరుకొని తహసీల్దార్ జ్ఞానాంబకు సమస్యను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరను మాత్రమే చెల్లించగలమని, అదనంగా ఇచ్చేందుకు మాకు అధికారాలు లేవని జట్టు కూలీలకు తహసీల్దార్ తెలిపారు. ట్రాక్టర్లు ర్యాంపునకు ఎక్కువగా రావడం లేదని, అందువల్ల కూలీ డబ్బులు సరిపోవడం లేదని, దీనికి తోడు ఎండలు మండిపోతున్నాయని తహసీల్దార్ జ్ఞానాంబకు కూలీలు ఏకరువు పెట్టారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ మీ సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని ఇవ్వండి.. దానిని జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకువెళ్తానని చెప్పారు. దీంతో జట్టు కూలీలు ఎగుమతి 225 రూపాయలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రాన్ని ఇచ్చారు. రేటు పెంచేంత వరకూ ఎగుమతి చేసేది లేదని చెప్పి జట్టు కూలీలు వెళ్లిపోయారు. దీంతో ఉచిత ఇసుక రవాణాకు బ్రేక్ పడింది.
చేపల బోటులో అగ్ని ప్రమాదం
కాకినాడ సిటీ/అల్లవరం, ఫిబ్రవరి 27: సముద్రంలో మోటరైజ్డ్ ఫిష్షింగ్ బోటులో గ్యాస్ స్టౌ వెలిగిస్తున్న సమయంలో గ్యాస్ లీకై ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు మత్స్యకారులు ప్రమాదానికి గురైయ్యారు. ఈ సంఘటన సోమవారం వేకువజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ జగన్నాధపురం కొండబాబునగర్‌కు చెందిన రేకాడి వీరబాబు, కొప్పనాతి సాయి, ముత్యాలు, కొప్పనాతి రాములు అనే మత్స్యకారులు మెకనైజ్డ్‌బోట్‌పై సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు సోమవారం వేకువజాము సమయంలో నర్సాపురం సమీపంలో చేపల వేటను సాగిస్తుండగా టీ కాయడానికి కొప్పనాతి సాయి గ్యాస్ స్టౌ వెలిగించాడు. ఈసందర్భంగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయ.. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న సాయకి తీవ్ర గాయాలయ్యాయ. వీరబాబుకు కూడా గాయాలయ్యాయి. మంటల వెలువడటంతో పడవలో ఉన్నవారంతా సముద్రంలోకి దూకి ప్రాణాలను రక్షించుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో కొందరు మత్స్యకారులు వీరిని సముద్రంలో రక్షించి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారని సమాచారం. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మత్స్యకారుడు సాయ, వీరబాబును కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై తమకు ఏవిధమైన ఫిర్యాదు అందలేదని అల్లవరం పోలీసులు తెలిపారు.