తూర్పుగోదావరి

ప్రజలను మభ్య పెట్టడానికే ప్రత్యేక హోదా డిమాండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, మార్చి 16: అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తామన్న బిజెపి, కాదు 15 ఏళ్లు కావాలన్న టిడిపి డిమాండ్లు ప్రజలను మభ్య పెట్టడానికేనా అంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ ఇరు పార్టీల తీరుపై ధ్వజమెత్తారు. గురువారం మండలంలోని గొల్లలమామిడాడలో జనావేదన సమ్మేళన్, ప్రత్యేక హోదా ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని అనపర్తి నియోజకవర్గ కన్వీనర్ అద్దంకి ముక్తేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నానాజీతోపాటు జిల్లా జనావేదన సమ్మేళన్ ఛైర్మన్ ఏడుకొండలు, రాష్ట్ర బిసి సెల్ అధ్యక్షుడు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పిసిసి నాయకులు మురళీ, జిల్లా ఎస్సీసెల్ నాయకులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో నానాజీ మాట్లాడుతూ ఎన్నడూ లేనివిధంగా ఇంటి పన్నులు పెంచి పేదల నడ్డి విరిచారని ఆరోపించారు. తక్షణమే ఇంటి పన్నుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జరిగిన ప్రజాజాబ్యాలెట్ యాత్రలో భాగంగా వీధుల్లో తిరిగి ప్రజల అభిప్రాయాలతో కూడిన బ్యాలెట్‌ను సేకరించారు. కార్యక్రమంలో బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాల కన్వీనర్లు రాయుడు రామచంద్రరావు, వి బాబీ, సత్తి బులిరెడ్డి, నాయకులు బోడా వెంకట్ పాల్గొన్నారు.

కౌన్సిలర్ల ఖాళీ స్థానాలకు ఎన్నికల షెడ్యూలు
రామచంద్రపురం, మార్చి 16: పురపాలక పరిధిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కౌన్సిలర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినట్టు పురపాలక కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ వెల్లడించారు. పట్టణంలో 17, 21, 25వ వార్డు కౌన్సిలర్ల స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. 24న పరిశీలన, 27న ఉపసంహరణలకు గడువు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన జరుగుతుందన్నారు. పోలింగ్ ఏప్రిల్ 9న జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు 11వ తేదీన జరుగుతుందని ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ముమ్మిడివరం వైస్-్ఛర్‌పర్సన్ భర్తపై హత్యాయత్నం
ముమ్మిడివరం, మార్చి 16: ముమ్మిడివరం నగర పంచాయతీ వైస్ ఛైర్‌పర్సన్ దివి మహాలక్ష్మి భర్త, సీనియర్ టిడిపి నాయకుడు దివి వెంకటేశ్వరరావుపై గురువారం రాత్రి హత్యాయత్నం జరిగింది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, టిడిపి నాయకులు తెలిపిన వివరాలిలా వున్నాయి. గురువారం రాత్రి స్థానిక ఎయిమ్స్ కళాశాలలో జరుగుతున్న అభ్యాస్ 2కె సాంస్కృతిక కార్యక్రమాలు చూసేందుకు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు వెళ్లారు. అనంతరం వారిని తీసుకువచ్చేందుకు వెంకటేశ్వరరావు 9 గంటల సమయంలో తన కారులో వెళ్లారు. అయితే కారును సమీపంలో కొబ్బరితోటలో పార్కు చేసి బయటకు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడిచేశారు. ఈ సంఘటనలో వెంకటేశ్వరరావుకు కడుపులో రెండుచోట్ల కత్తిపోట్లయ్యాయ. గాయపడిన వెంకటేశ్వరరావును హుటాహుటిన టిడిపి నాయకులు, కుటుంబ సభ్యులు అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనపై వెంకటేశ్వరరావు ప్రాణభయంతో 216 జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో దుండగులు అక్కడ నుండి పరారైనట్టు చెపుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై తమకు ఏవిధమైన ఫిర్యాదు అందలేదని ఎస్సై ఎం అప్పలనాయుడు తెలిపారు.