తూర్పుగోదావరి

ఎసిబి వలలో పంచాయతీరాజ్ ఎఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరప, మార్చి 16: కరప మండల పంచాయితీరాజ్ ఎఇగా పనిచేస్తున్న కర్రి నాగభూషణం గురువారం రూ.30 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికార్ల వలలో చిక్కారు. మండలంలోని వేళంగి గ్రామంలో కాంట్రాక్టర్ నుండి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. బిల్లులు మంజూరుకోసం ఎఇ రూ. 30 వేలు డిమాండ్ చేయడంతో పాటు, అతని వ్యవహార శైలిపై విసుగెత్తిన కాంట్రాక్టర్ ఎసిబి అధికారును సంప్రదించడంతో గురువారం వేళంగిలో వలపన్ని డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రెండేళ్ల క్రితం కాకినాడ రూరల్ మండల ఇంజినీరింగ్ అధికారిగా పనిచేస్తూ బదిలీపై కరప మండలానికి వచ్చిన నాగభూషణం వ్యవహార శైలి ఆదినుంచి వివాదాస్పదమే. చేసిన పనికి బిల్లులు చేయాలంటే భారీగా లంచం డిమాండ్ చేయడంతో పాటు నెలల తరబడి బిల్లులు చేయకుండా పెండింగ్‌లో పెడతారనే ఆరోపణలున్నాయి. దీనికి తోడు స్థానిక ప్రజాప్రతినిధులంతా తనకు బంధువులని పైరవీలు చేయడంతోపాటు కాంట్రాక్టర్లను తిడతారనే ఆరోపణలున్నాయి. తాజాగా కరప మండలం వేళంగి గ్రామంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకుడు గత ఏడాది సిసి రోడ్లు నిర్మాణం చేపట్టాడు. పనులు పూర్తయ్యి ఏడాది గడిచినా బిల్లులు మంజూరవ్వకపోవడంతో ఎఇ నాగభూషణంను సంప్రదించగా భారీ మెత్తంలో లంచం డిమాండ్ చేయడంతో కొంత ముట్టచెప్పారు. అయితే సొమ్ములు తీసుకున్నా బిల్లులు మంజూరు చేయలేదని ప్రధాన ఆరోపణ. తాజాగా సదరు కాంట్రాక్టర్ వేళంగిలో చేపట్టిన మార్కెట్ షెడ్డు నిర్మాణం దాదాపు పూర్తికావడంతో ఈ పనికి కూడా ఎఇ భారీగా లంచం డిమాండ్ చేశారు. దీంతో విసుగెత్తిన కాంట్రాక్టర్ రాజమహేంద్రవరం ఎసిబి అధికారులను సంప్రదించి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో ఎసిబి డిఎస్పీ సుధాకర్ బృందం ఎఇ నాగభూషణంపై నిఘా పెట్టారు. మార్కెట్ షెడ్డు నిర్మాణ పనులు తనిఖీకి వస్తున్నానని, సొమ్ములు ముట్టచెప్పకపోతే బిల్లులు మంజూరు చేసేది లేదని ఎఇ తేల్చిచెప్పడంతోకాంట్రాక్టర్ విషయాన్ని ఎసిబి అధికారులకు చేరవేశారు. వారిచ్చిన ప్లాన్ ప్రకారం ఉదయం మార్కెట్ షెడ్డు వద్ద కాంట్రాక్టర్ నుండి ఎఇ నాగభూషణం రెండువేల నోట్లు రూపంలో రూ. 30 వేలు తీసుకుని లెక్కపెట్టుకుని ప్యాంటు జేబులో పెట్టుకునే సమయంలో అక్కడే మాటువేసి ఉన్న ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ఎసిబి అధికారులు ఎఇని ప్రశ్నించగా ఎవరో కుట్రచేసి చేతిలో నగదు పెట్టి వెళిపోయారని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కుట్రచేసి సొమ్ములు చేతిలో పెడితే నోట్లు మడతపెట్టి ప్యాంటు జేబులో ఎందుకు పెట్టుకున్నారని, అలాగే లంచం డిమాండ్ చేసినట్టు తమవద్ద ఆధారాలు ఉన్నాయని ఎసిబి అధికారులు చెప్పడంతో ఎఇ నోటి వెంట సమాధానం రాలేదు. అలాగే ఎఇని పరీక్షించగా అవి కాంట్రాక్టర్ ఇచ్చిన నగదుగా తేలడంతో ఎసిబి అధికారులు ఎఇ నాగభూషణాన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణ అనంతరం నిందితుడ్ని అరెస్ట్ చేసి విజయవాడ ఎసిబి కోర్టుకు తరలిస్తామని ఎసిబి డిఎస్పీ సుధాకర్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమను నేరుగా గానీ, 9440446160 ఫోన్ నెంబర్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. ద్రాక్షారామ ఎస్సై, కేశనకుర్రు పంచాయతీ కార్యదర్శి, తాజాగా కరప మండల ఇంజినీరింగ్ అధికార్లపై అవినీతి కేసులు నమెదు చేశామని డిఎస్పీ సుధాకర్ తెలిపారు.
కాగా ప్రశాంతంగా ఉండే కరప మండలంలో తొలిసారి ఎసిబి ట్రాప్ జరగరడంతో మండల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గతంలో మండలంలో వివిధ శాఖల్లో పనిచేసిన అధికారులతో ఇబ్బందులు వచ్చినా ఎప్పుడూ ఎసిబి ఫిర్యాదుల వరకూ వెళ్లిన చరిత్ర లేదు. అయితే తొలిసారి మండల స్థాయి ఇంజినీరింగ్ అధికారి లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కడంపై మండలంలో సర్వత్రా చర్చ జరుగుతోంది.

రహదార్ల పైనుంచి...
జనావాసాల్లోకి!
-తొలగింపుతో చొచ్చుకొస్తున్న మద్యం దుకాణాలు
-ప్రజల్లో ఆందోళన, అధికార్ల ఎదుట అభ్యంతరాలు
కడియం, మార్చి 16: సుప్రీంకోర్టు ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న మద్యం షాపులు హడావిడిగా మార్చాల్సిన పరిస్థితులు రావడంతో కొన్ని షాపులు జనావాసాల మధ్యకు వస్తున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కడియం మండలంలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి సుమారు ఆరు మద్యం షాపుల వరకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రహదారులకు 500 మీటర్ల దూరానికి తరలించాల్సి ఉంది. అయితే షాపు యజమానులకు తక్కువ సమయం ఇవ్వడంతో వారు హడావిడిగా జనావాసాల మధ్య షాపుల ఏర్పాటుకు లైసెన్సుల మంజూరుకు దరఖాస్తులు చేసుకున్నారు. దీనిపై పలువురి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. మద్యం షాపులను జనావాసాల మధ్య కాకుండా ఊరికి కొద్ది దూరంలో ఏర్పాటుచేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కోరుతున్నారు. వేమగిరిలో జాతీయ రహదారిని ఆనుకుని రెండు మద్యం షాపులు ఉండగా వాటిని స్థానిక దేవీజనార్ధన్‌నగర్‌లోకి జనావాసాల మధ్యకు మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయమై పలువురు ఎక్సైజ్ అధికారుల వద్ద అభ్యంతరాలు తెలియజేసినా తమకు ప్రభుత్వం నుంచి వచ్చిన నియమ నిబంధనల మేరకే ఏర్పాటుచేస్తున్నామని, జనావాసాల మధ్యనే షాపులు ఏర్పాటుచేయకూడదనే నిబంధన ఏమీ లేదని చెబుతున్నారు. ఏదేమైనా జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చేపడుతున్న చర్యలు జనావాసాల మధ్య ఇబ్బందులు ప్రేరేపించే చర్యలుగా మారుతున్నాయి.