తూర్పుగోదావరి

ఒకే గ్రామం నుండి ఇరువురు మహిళా ఎస్సైలు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, మార్చి 25: కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆ విద్యార్థినులు. నిరుపేద కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో తర్ఫీదు పొంది లక్ష్యాన్ని సాధించారు. మండలంలో చిన్న గ్రామమైన దూసరపాము నుండి ఇరువురు మహిళా ఎస్సైలుగా ఎంపికై ఔరా అనిపించారు. చిన్నపాటి వ్యవసాయం చేసుకొని జీవించే పోతంశెట్టి సుబ్బారావు, మేరీ దంపతుల కుమార్తె అయిన శ్యామలా అపర్ణ మహిళా ఎస్సైగా ఎంపికైంది. అపర్ణ ప్రాథమిక విద్య స్వగ్రామమైన దూసరపాములో పూర్తిచేయగా ఉన్నత పాఠశాల విద్య ఎపి గురుకుల పాఠశాల తునిలో పూర్తిచేసిన అనంతరం, కాకినాడ మహిళా కళాశాలలో బికాం, జెఎన్‌టియులో ఎంబిఎ పూర్తిచేసింది. అనంతరం ఎఇగా పనిచేస్తున్న అన్న వంశీ అభిషేక్ ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్‌లో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ ఎస్సై పరీక్ష రాసింది. జోన్ రెండులో ఆమె 216 మార్కులు సాధించి 5వ స్థానాన్ని కైవసం చేసుకొని ఓపెన్ కేటగిరీలో ఈ పోస్టుకి ఎంపికైంది. విధి నిర్వహణలో నీతి నిజాయితీకి ప్రాధాన్యతనిస్తానని ఆమె ఆంధ్రభూమికి తెలిపారు. పేద రైతు కుటుంబంలో జన్మించిన అపర్ణ ఎస్సై పోస్టుకి ఎంపిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు సుబ్బారావు, మేరి అన్నారు.
ఉపాధి హామీ పనులు చేసుకొంటూ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్న నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించిన కంచెం చిన్నారి కూడా ఆర్ ఎస్సై పోస్టుకు ఎంపికైంది. దూసరపాము గ్రామానికి చెందిన కంచెం అర్జునుడు, కుసుమల కుమార్తె అయిన చిన్నారి ప్రాథమిక విద్య దూసరపాములో, ఆరు నుండి ఇంటర్ వరకు స్థానిక గురుకుల పాఠశాల, కళాశాలలో చదివింది. చిన్నారి రాజమండ్రి మహిళా కళాశాలలో బిఎస్సీ కంప్యూటర్ డిగ్రీ పూర్తిచేసింది. చిన్ననాటి నుండి చిన్నారికి పరుగుపందెం అంటే చాలా మక్కువ. స్థానిక గురుకుల పాఠశాలలో 6, 7 తరగతులు చదువుతున్న సమయంలోనే 100, 200 మీటర్ల పరుగుపందెంలో సత్తా చాటి జాతీయ స్థాయి ఆటల పోటీల్లో పలు బహుమతులు గెలుచుకుంది. పంజాబ్, యుపి రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో ఆమె ఛాంపియన్‌గా నిలిచింది. ఎన్‌సిసిలో ప్రవేశం ఉండడం, అథ్లెటిక్స్ తాను ఎస్సై పోస్టు పొందేందుకు అదనంగా తోడ్పడ్డాయని చిన్నారి తెలిపారు. ఆర్ ఎస్సై (రిజర్వు ఎస్సై)గా ఎంపికైక ఆమె ఏడాది పాటు కాకినాడలో ఒక ప్రైవేటు సంస్థలో తర్ఫీదు పొందారు. ఈ పోస్టు తనకు ఇంత త్వరగా వస్తుందనుకోలేదని, చాలా ఆనందంగా ఉందని చిన్నారి ఆంధ్రభూమితో అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తమ బిడ్డ ఈ స్థాయికి ఎదుగుతుందని ఆనుకోలేదని ఆమె తల్లిదండ్రులు కుసుమ, అర్జునుడు అనందానికి అవధులు లేకుండా పోయాయి. 500 మంది జనాభా ఉండే తమ గ్రామం నుండి ఇరువురు మహిళలు ఎస్సైలుగా ఒకేసారి ఎంపిక కాబడం ఊహించని విషయమని కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీలేదని వీరు నిరూపించారని గ్రామస్థులు గర్వంగా చెబుతున్నారు.
పొంచివున్న ప్రమాదం
సామర్లకోట, మార్చి 25: నిత్యం జనం, ప్రయాణీకులు, వాహనాల రద్దీతో వుండే సామర్లకోట-కాకినాడ రోడ్డులో ప్రమాదం పొంచి ఉంది. కాలం చెల్లిన వృక్షాలు ప్రయాణీకులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సామర్లకోట-కాకినాడ రోడ్డులో మహర్షి సాంబమూర్తి రిజర్వాయర్ దాటిన తదుపరి బాగా ఎండిపోయిన చెట్టు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ప్రమాదకరంగా మోడువారి ఎండివున్న చెట్టును తక్షణమే ఆర్‌అండ్‌బి అధికారులు తొలగించాలని, ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. వాహనాల రాకపోకల సమయంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉందని, తక్షణమే అధికారులు స్పందించి ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.