తూర్పుగోదావరి

ద్రాక్షారామలో నేటి నుండి అతిరుద్ర మహాయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 19: ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలు సుఖశాంతులతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుభిక్షంగా ఉండేందుకు దక్షిణ కాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామివార్ల ఆలయం వద్ద ఆదివారం ఉదయం నుండి అయిదు రోజులు అతిరుద్ర మహాయజ్ఞం, మహా కుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహింపచేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు తోట త్రిమూర్తులు వెల్లడించారు. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం వెలుపల ఉత్తర ద్వారం వద్ద అతిరుద్ర మహాయజ్ఞం, మహా కుంభాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టు ఆయన వివరించారు. రుద్ర రూపంలో ఉండే పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు చేసే క్రతువును రుద్రం అంటారన్నారు. విశ్వవ్యాప్తమైన పరమశివుని నామాన్ని వేద పండితులు వేద మంత్రాలతో జపిస్తూ రుద్రం చేస్తారన్నారు. రుద్రంతో ప్రసన్నమైన బోళాశంకరుని జపిస్తూ కోరికలు తీర్చాలని అర్ధిస్తారన్నారు. ఈ అంశంపై శ్రీకృష్ణ యజుర్వేదం మధ్య భాగంలో రుద్రాధ్యాయంలో రుద్రం విశిష్టతగా పేర్కొన్న విషయాన్ని ఎమ్మెల్యే తోట ఉటంకించారు. ఇటీవల గోదావరి మహాపుష్కరాలను వైభవోపేతంగా నిర్వహింపచేసుకున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా పెంచలకోన గ్రామానికి చెందిన మణిదీప మహాసంస్థానం మాతా విజయశ్రీ అమ్మవారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపచేయడం అందరి కన్నుల వేడుక, పుణ్య చరితగా పేర్కొన్నారు. ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరాలయంలో శ్రీ భీమేశ్వరస్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు, భీమేశ్వరస్వామివారి ప్రధాన ఆలయం శిఖరం (కలశం) వద్ద మహా కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు తెలిపారు.
ద్రాక్షారామలో సందడే సందడి
పంచారామ క్షేత్రం, త్రిలింగ క్షేత్రం, ద్వాదశ శక్తిపీఠం కలిగిన ద్రాక్షారామ గ్రామంలో ఆదివారం నుండి అయిదు రోజులు భక్తులకు సందడి నెలకొననుంది. మనిషి తన జీవితకాలంలో రోజుకు ఒకసారి రుద్రం చేస్తే అతిరుద్రం చేసేందుకు 40 సంవత్సరాల 41 రోజులు పడుతుందని అతిరుద్ర మహాయజ్ఞం బ్రహ్మ వెంకటరమణ భట్ తెలిపారు. అతిరుద్ర మహాయజ్ఞం 11 రోజులు జరగాలని, అయితే సమయాభావం వల్ల ఆరు రోజుల్లో క్రతువు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా యజ్ఞశాలలో 13 పెద్ద హోమగుండాలు, 144 చిన్న హోమగుండాలు ఏర్పాటు చేశారు. 11 హోమగుండాల వద్ద అతిరుద్ర మహాయజ్ఞం, ఒక హోమగుండం వద్ద గణపతి హోమం, మరో హోమగుండం వద్ద చండీయాగం నిర్వహిస్తారు. మిగిలిన 144 హోమగుండాలు పుణ్య దంపతులు యాగం చేసేందుకు ఏర్పాటు చేసినట్టు వెంకటరమణ భట్ తెలిపారు. అతిరుద్ర మహాయజ్ఞ దర్శనం సాక్షాత్తు భగవంతుని దర్శనం లభించినట్లేనన్నారు. ఈ యజ్ఞంలో పాల్గొనడం, దర్శించడం కోటానుకోట్ల జన్మఫలమన్నారు. మాతాజీ విజయశ్రీ అమ్మ ఆధ్వర్యంలో నేపాల్‌లో పశుపతినాధ్ ఆలయంలో, అమెరికాలో ఈ యజ్ఞం నిర్వహించినట్టు ఆయన చెప్పారు. అతిరుద్ర మహాయజ్ఞం చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల నుండి వేద పండితులు చేరుకున్నారు. అమెరికా, నెదర్లాండ్ తదితర దేశాల నుండి విజయశ్రీ అమ్మవారి భక్తులు ద్రాక్షారామ వచ్చారు.
ఎమ్మెల్యే తోట ఆధ్వర్యంలో భోజన వసతి
స్థానిక శాసనసభ్యుడు తోట త్రిమూర్తులు నేతృత్వంలో అతిరుద్ర మహాయజ్ఞం, మహా కుంభాభిషేకానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు సకల ఏర్పాట్లు చేశారు. ఉత్తర గోపురం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ ప్రసన్నాంజనేయస్వామి బాలభక్త సమాజం అధ్యక్షులు నున్న రామచంద్రరావు, కోటిపల్లి ఆదేశ్వర సూర్యనారాయణ (అబ్బు), తోట ఫృద్వీరాజ్, శాఖా బాబి, పోలిశెట్టి తాతబ్బాయి తదితరులు అన్నదానం నిర్వహణ బాధ్యతలు స్వీకరిస్తారు.
కాగా ఆదివారం ఉదయం 5.30 గంటలకు గంగాపూజ, గో పూజ, శ్రీ గణేష పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశనం, అంకురార్పణ, దీక్షా కంకణధారణ, రుత్విక్‌వరణం, యాగశాల ప్రవేశం, పూర్వాంగ దశధార, దేవనంది, షోడశాసన, అగ్నిమథనం జరుగుతుంది. సాయంత్రం ఆరు గంటలకు శ్రీనివాస కల్యాణం, వేద పఠనం, కీర్తనం, చండీ పారాయణ జరుగుతుంది.