తూర్పుగోదావరి

బరితెగించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 31: అర్బన్ ఎస్పీ కార్యాలయం సమీపంలోనే ముగ్గురు గొలుసు దొంగలు భార్యాభర్తలపై దాడిచేసి వీరంగం సృష్టించడం శుక్రవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో భర్త గాయపడగా, చోరులను పట్టుకోవడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారొచ్చిన స్కూటర్‌ను వదిలి పరారయ్యారు. రాజమహేంద్రవరంలోని అర్బన్ ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. వివరాలిలావున్నాయ... జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బర్మా కాలనీ నుంచి ఎవి అప్పారావు రోడ్డులోకి జాతీయ రహదారి సర్వీసు రోడ్డు మీదుగా శుక్రవారం సాయంత్రం బార్యాభర్త తమ ఇద్దరు పిల్లలతో కలసి బైక్‌పై వెళుతున్నారు. ఈలోగా యాక్టివా స్కూటర్‌పై ముగ్గురు యువకులు ఎదురుగా వచ్చి బైక్‌పై వెళుతోన్న భార్యాభర్తలను ఢీకొట్టి, భార్య మెళ్లో గొలుసు తెంచుకునేందుకు ప్రయత్నించారు. అయతే వారి ప్రయత్నాలను భార్యాభర్తలు ప్రతిఘటించడంతో వీరి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. చోరులు ముగ్గురూ కలిసి భార్యాభర్తలను కిందపడేసి కాళ్లతో తన్నుతూ దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో స్థానికులు నిశే్చష్టులయ్యారు. వారంతా తేరుకుని, దొంగలను నిలువరించే ప్రయత్నంచేయగా పరారయ్యారు. స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు పరుగున వచ్చి ఒక యువకుడిని దాదాపు పట్టుకున్నప్పటికీ, షర్టు చిరిగిపోవడంతో అతనుకూడా పరారయ్యాడు. చోరులు ముగ్గురూ 20 ఏళ్ల లోపు యువకులేనని స్థానికులు తెలిపారు. ఈ దాడిలో భార్యాభర్తలిద్దరికీ తలకు గాయాలయ్యాయి. చోరులు వదిలివెళ్లిన స్కూటర్‌కు నంబర్ ప్లేట్ లేదని స్థానికులు తెలిపారు. ఒక వైపు ఎస్పీ ఆఫీసు, పైగా జంక్షన్ అయినప్పటికీ బరితెగించిన చైన్ స్నాచర్ల వీరంగం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా శుక్రవారం రాత్రి ముగ్గురు యువకులు ప్రకాష్‌నగర్ పోలీసు స్టేషన్‌కు వచ్చి, బైక్‌ను ఢీకొట్టిన సందర్భంగా జరిగిన ఘర్షణగా పేర్కొన్నట్టు సమాచారం.

మరో యువతికి స్వైన్ ఫ్లూ?
రావులపాలెం, మార్చి 31: ఇప్పటికే రావులపాలెంలో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు ఆందోళన రేకెత్తిస్తుండగా తాజాగా మండలంలోని దేవరపల్లిలో ఒక యువతికి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయినట్టు సమాచారం రావడం మరింత కలవరం కలిగిస్తోంది. గ్రామానికి చెందిన 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఇటీవల శ్వాస సంబంధిత సమస్య రావడంతో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చికిత్స అందజేస్తున్నారు. అయితే ఇటీవల రావులపాలెంలో స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో అక్కడి వైద్యులు ఆమెకు స్థానికంగా గల ఒక ప్రైవేటు ల్యాబ్‌లో స్వైన్‌ఫ్లూ పరీక్షలు చేయించారు. పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు తెలిసింది. దీంతో ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వైన్ ఫ్లూ వార్డుకు పంపగా రక్తం, కళ్లె సేకరించి వ్యాధి నిర్ధారణ నిమిత్తం విశాఖపట్నం పంపినట్టు తెలిసింది. అలాగే ముందు జాగ్రత్త చర్యగా స్వైన్‌ఫ్లూ నివారణ మందులు ఇచ్చి పంపినట్టు సమాచారం.