తూర్పుగోదావరి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక వాహనాలతో పెట్రోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మార్చి 31: జాతీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు నిరంతరం రోడ్డు సేఫ్టీ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. రాష్ట్ర డిజిపి సాంబశివరావు జిల్లాలోని ఎన్‌హెచ్-16లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జిల్లాకు నూతనంగా మూడు రోడ్డు సేఫ్టీ వాహనాలకు సమకూర్చారు. వాటిని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఎస్పీ రవిప్రకాష్ ప్రారభించారు. ఈసందర్భంగా ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడుతూ ఎన్‌హెచ్-16లో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఇప్పటికే మూడు వాహనాలు ఉన్నాయని, కొత్తగా సమకూరిన మూడింటితో కలిపి ఆరువాహనాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రతీ వాహనంలోని ఎఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌తో కూడిన బృందం రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు హుటాహుటీన చేరుకుని బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తారన్నారు. అంతే కాకుండా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించడం, రోడ్డుపక్కన లారీలు, ఇతర వాహనాలు, ఆటోలు నిలుపుచేసి ఉంటే వాటిని తొలగించడం, అవసరం అయితే వాటిని సీజ్ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీలు ఎఆర్ దామోదర్, వై రవిశంకర్‌రెడ్డి, డిఎస్పీలు ఎన్‌బిఎం మురళీకృష్ణ, ఎస్ మురళీమోహన్, కెవి సత్యనారాయణ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.