తూర్పుగోదావరి

ఆరునెలల పసికందుకు అరుదైన వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఏప్రిల్ 15: ఆరవ నెలలో పరిపక్వత లేకుండా 650 గ్రాముల బరువుతో జన్మించిన పసికందుకు స్థానిక సంజీవి ఆసుపత్రి నియోనెటాలజిస్ట్ డాక్టర్ అంగర రవి ఆధ్వర్యంలో వైద్య బృందం అత్యాధునిక వైద్యం అందజేసింది. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నెక్కంటి సూర్యప్రకాష్ తమ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పసికందుకు సంబంధించి తెలిపిన వివరాలిలావున్నాయి. కాకినాడ నగరానికి చెందిన బి వీరలక్ష్మి వివాహం జరిగిన ఎనిమిది సంవత్సరాలు అనంతరం గర్భవతి కాగా ఎస్‌ఎల్‌ఇ అనే వ్యాధికి లోనుకావడం జరిగింది. దీంతో ఆమె సంజీవి ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. డాక్టర్ రవి నేతృత్వంలో వైద్యుల బృందం వీరలక్ష్మికి వివిధ రకాల వైద్యపరీక్షలను నిర్వహించి గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదల లేక శిశువు పరిస్థితి విషమించే అవకాశముందని గుర్తించారు. శిశువు పరిస్థితి విషమించకుండా గత జనవరి 4వ తేదీన శిశువును ప్రసవంచేశారు. ఆ సమయానికి ఆరునెలలు వయస్సు 650గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు ఊపిరితిత్తులు, ప్రేగులు, మెదడుకు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తాయి. దీంతో అత్యాధునిక కృత్రిమంగా గర్భంలోవలే వెచ్చదనానిచ్చే పరికరాలు, శ్వాసకు సహాయంచేసే వెంటిలేటర్, ఊపిరితిత్తులకు హాని కలిగించని రీతిలో తేమతో కూడిన గాలి, ఆక్సిజన్ అందించే పరికరాలు ఏర్పాటు చేసి, ఊపిరితిత్తులు, మెదడు పరిపక్వత పెంచే అత్యాధునిక మందుల సహాయంతో అత్యంత క్లిష్టమైన ప్రాణాప్రాయస్థితి నుండి నేడు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన బిడ్డగా డాక్టర్ రవి నేతృత్వంలో వైద్య బృందం తీసుకువచ్చినట్లు డాక్టర్ సూర్యప్రకాష్ తెలిపారు. తమ ఆసుపత్రి ఇప్పటివరకు ఎన్‌టిఆర్ వైద్యసేవ ద్వారా కేవలం ఆర్ధోపెడిక్ విభాగంలో వైద్యం అందించేవారిమని, ఇకనుండి అన్ని వసతులతో అన్ని రకాల అత్యాధునిక వైద్య సేవలను అందజేయగలుగుతున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రవి, డాక్టర్ పి సుబ్బారావు, డాక్టర్ రమ్య, డాక్టర్ కె శ్రావణి, డాక్టర్ వి శ్రీనివాస్, డాక్టర్ రామారావు, డాక్టర్ కినె్నర వీణ, డాక్టర్ అనుపమ, బిడ్డ తల్లి వీరలక్ష్మిలు పాల్గొన్నారు.
నిమిథోడ్ వ్యాధిపై నర్సరీ రైతులకు అవగాహన
కడియం, ఏప్రిల్ 15: జామ, నిమ్మ మొక్కల్లో అరుదుగా వచ్చే నిమిథోడ్ వ్యాధిపై శనివారం తమిళనాడుకు చెందిన ఉద్యానవన ప్రొఫెసర్ డాక్టర్ పూర్ణిమ నర్సరీ రైతులకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. కడియపులంక నర్సరీమెన్ అసోసియేషన్ ఆవరణలో జరిగిన ఈ అవగాహనా సదస్సుకు సైంటిస్టులు డాక్టర్ ఆర్‌కె వాల్యా, భగవాన్‌లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ పూర్ణిమ మాట్లాడుతూ నిమిథోడ్ వ్యాధి చాలా ప్రమాదకరమైందని, అది మొక్క వేరు భాగంలో వ్యాపించి మొక్కను పూర్తిగా చంపేస్తుందన్నారు. ఈ వ్యాధి సోకిన మొక్కలు నీటిని సరిగ్గా స్వీకరించలేక వాడిపోతాయని, అటువంటి లక్షణాలు గుర్తించి 0.5 ఫార్మాలిన్ మందును 100 ఎంఎల్‌ను కిలో మట్టిలో కలిపి మొక్క వేరు భాగంలో వేయాలని, పైన పాలిథిన్ సంచిని కప్పి ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో నర్సరీ రైతులు, నర్సరీ రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.