తూర్పుగోదావరి

మన్యంలో పెరిగిన ఉష్టోగ్రత: గిరిజనుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, ఏప్రిల్ 15: ఏజెన్సీ ప్రాంతంలో సైతం శనివారం ఒకేమారు ఉష్టోగ్రత పెరగడంతో మన్యం వాసులు తల్లడిల్లిపోయారు. అధిక వేడి, ఉక్కపోతతోపాటు వడగాల్పులు కూడా వీచాయి. మండలంలో దాకరాయి గ్రామానికి చెందిన కిల్లో నరసింగరావు (55) వడగాల్పులకు తట్టుకోలేక మరణించాడు. నరసింగరావు జీడిమామిడితోటలో కూలి పనిచేస్తుండగా కుప్పకూలిపోయాడు. తోటి కూలీలు అతనికి సపర్యలు చేస్తుండగానే కన్నుమూశాడని గిరిజనులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన నరసింగరావు భార్య కొంతకాలం క్రితం పక్షవాతానికి గురైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వైసిపి జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్‌రాజా కోరుతున్నారు.
చేనేత వస్త్రాలు కొనుగోలు చేసిన సబ్ కలెక్టర్
రాయవరం, ఏప్రిల్ 15: మండలంలోని పసలపూడి చేనేత సహకార సంఘం తయారు చేస్తున్న వస్త్రాలను కొనేందుకు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీమణి రమేష్ రంగనాథన్ శనివారం వచ్చారు. సొసైటీలో ఉన్న వివిధ రకాల వస్త్రాలను వారు తిలకించి పలు విషయాలను సంఘం ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పసలపూడి చేనేత వస్త్రాల విశిష్టతను తెలుసుకుని వచ్చినట్టు వారు చెప్పారు. కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీవో కె సుబ్బారావు, ఎంపిడిఒ ఎన్‌వివిఎస్‌ఎన్ మూర్తి, మండపేట తహసీల్దారు ఎన్ వెంకటేశ్వరరావు, ఎస్సై వి సురేష్, ఎఎస్సై కెవివి సత్యనారాయణ, విఆర్వోలు చిరట్ల బాపిరాజు, పి నాగేశ్వరరావు, వీరయ్య పాల్గొన్నారు.
‘కోట’లో రన్ ఫర్ జీసస్ ర్యాలీ
సామర్లకోట, ఏప్రిల్ 15: ‘జయహో...జయహో...యేసు లేచేను’..అంటూ శనివారం సామర్లకోట పట్ణణ వీధులు క్రైస్తవ భక్తులు చేసిన నినాదాలతో మార్మోగాయి. మండల పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 6 గంటలకు జోరుగా హుషారుగా రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించారు. తొలుత స్థానిక సిబిఎం హైస్కూల్ వద్ద తరలివచ్చిన వేలాది మంది క్రైస్తవ యువతీ యువకులు, నాయకులు, పలు చర్చిల నిర్వాహకులతో ఏర్పాటుచేసిన రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రతిభా విద్యానికేతన్ డైరెక్టర్ ప్రకాష్, టిడిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. యేసు క్రీస్తు సమాధి నుండి తిరిగి లేచేను అను సువార్తను లోకానికి చాటి చెబుతూ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ వీధుల్లో, ప్రధాన కూడళ్ల మీదుగా నినాదాలతో ఈ ర్యాలీ సాగింది. ర్యాలీలో యువతీ యువకులు తెలుపురంగు టీ షర్టులు, టోపీలు ధరించి ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. స్థానిక సెంటినరీ బాప్టిస్టు చర్చి వద్ద ర్యాలీ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ వర్తమానికులు రైట్ రెవరెండ్ డాక్టర్ ఈలి సత్యసువార్తరాజు, పాస్టర్ల అసోసియేషన్ నాయకులు ఆర్ లాజరస్, ఎ చంటిబాబు, జి జయబాబు, కల్వరీ సెమిట్రీ కమిటీ నాయకులు ఊబా జాన్ మోజెస్, టౌన్ క్రిష్టియన్ యూత్ నాయకులు సల్లూరి కళ్యాణ్, ఎండివి ప్రసాద్, బొడ్డు రామారావు, ఉప్పలపాటి చంద్రయ్యదాసు, పెద్దాపురం మాజీ జడ్పీటీసీ బంగారు కృష్ణ, మండల పరిధిలో అందరు ఫాస్టర్లు, వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నారు.