తూర్పుగోదావరి

కడియపులంకలో స్వైన్‌ఫ్లూ కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, ఏప్రిల్ 15: కడియపులంకలో ఓ వ్యక్తికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు బయటపడడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. కిరాణా వ్యాపారం చేసుకునే గ్రంథి సత్యనారాయణ అనే సత్తిబాబు గత పది రోజులుగా తీవ్రమైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. రాజమహేంద్రవరంలో అతనిని పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలుగా గుర్తించి నిర్థారణకు హైదరాబాద్ పంపించారు. ప్రస్తుతం సత్తిబాబు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. దీంతో కడియపులంకలో శనివారం వైద్య ఆరోగ్య శాఖాధికారులు పర్యటించి, గ్రామ పంచాయతీలో అవగాహనా సదస్సు ఏర్పాటుచేశారు. గ్రామంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక అంగన్‌వాడీ కార్యకర్తను నియమించి, స్వైన్‌ఫ్లూపై అవగాహన కల్పించడంతోపాటు అందుబాటులో ఉన్న హోమియోపతి మందులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు సర్పంచ్ వారా పాప తెలిపారు.
గ్రామాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి
వైద్య సిబ్బందికి కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచన
కోరుకొండ, ఏప్రిల్ 15: వైద్య సిబ్బంది పనిచేసే చోటే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని జిల్లా కలెక్టరు హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది స్థిర నివాసం లేకపోవడం తప్పని, ఇప్పటికైనా గ్రామాల్లో వైద్య సిబ్బంది నివాసం ఉండాలన్నారు. నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణంలో రాజానగరం నియోజకవర్గం జిల్లాకే ఆదర్శంగా నిలిచిందని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ఈ రెవెన్యూ డివిజన్లో గ్రామలు నిలిచాయన్నారు. జూన్ 1నుండి మొదటి క్రాప్‌కు నీటి సరఫరా అందించనున్నట్లు తెలిపారు. అదే విధంగా నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా చెరువులు, కాలువలు పూడిక తీత పనులు చేసుకోవచ్చునని, నిధులకు లోటు లేదని అన్నారు. అనంతరం రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ మాట్లాడుతూ మండలంలో పనిచేస్తున్న ఎఎన్‌ఎంల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు బాగోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ప్రతీ గ్రామానికి క్లినిక్‌ల కోసం భవనాలు నిర్మాణం చేస్తున్నామని, వైద్య సిబ్బంది 9 నుండి 11 గంటల వరకూ ఆ క్లినిక్‌లలో తప్పనిసరిగా ఉండి గ్రామస్థులకు మందులు పంపిణీ చేయాలన్నారు. అదే విధంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, పరిశుభ్రంగా ఉంటే ఆనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు. అదే విధంగా ప్రతీ గ్రామానికి ఒక సోలార్ లైటును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లు, ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సబ్ కలక్టరు విజయ్‌కృష్ణన్, ఎఎంసి ఛైర్మన్ తనకాల నాగేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ మాతా సీతారాముడు, కోరుకొండ సొసైటీ అధ్యక్షులు నాగా రమేష్, బూరుగుపూడి సొసైటీ అధ్యక్షులు కంటే నాగ కేశవరావు, తెలగంశెట్టి శ్రీను, మాతా ప్రభు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.