తూర్పుగోదావరి

విలీన మండలాల్లో కలెక్టర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా విలీన మండలమైన చింతూరులో తొలిసారిగా శనివారం పర్యటించారు. ముందుగా స్థానిక ఐటిడిఎలో ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. సమావేశ మందిరంలోకి పాత్రికేయులకు అనుమతి ఈయలేదు. దీంతో పాత్రికేయులు సమావేశ మందిరం వెలుపలే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమావేశం ముగించుకుని కలెక్టర్ బయటకు రాగానే ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను ఏజన్సీలో గిరిజన సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. అలాగే కుమ్మూరు గ్రామానికి చెందిన కురసం సుబ్బారావు అనే వ్యక్తి పోలవరం ముంపునకు గురయ్యే భూములకు ఒకేసారి పరిహారం అందేలా చూడాలని కోరారు. అనంతరం ఒడిస్సా, ఆంధ్ర రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు కళ్లేరు వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఇదిలా ఉండగా ఐటిడిఎ పిఒ చినబాబు కలెక్టర్ పర్యటన ఉందని, మధ్యాహ్నం 2గంటలకు హాజరుకావాలని పాత్రికేయులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాత్రికేయులు మధ్యాహ్నం 2గంటలకు మండుటెండలో ఐటిడిఎ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టర్ సమావేశానికి పాత్రికేయులకు అనుమతి ఇవ్వకపోవడంతో సుమారు మూడు గంటల పాటు ఐటిడిఎ ఆవరణలోనే వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో పాత్రికేయులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
వైభవంగా వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఐ పోలవరం, ఏప్రిల్ 29 : మురమళ్ళ గ్రామంలో నిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ వీరేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటలకు స్వామి అమ్మవార్ల అభిషేకం, స్వామివార్లను నూతన వధూవరులను చేశారు. శైవగమన యుక్తంగా శైవగమ పండిత స్వర్ణరుద్రాక్ష కంకన, స్వర్ణ సింహా తలాట సన్మాన గ్రహీత బ్రహ్మశ్రీ యనమండ్ర సీతారామశర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాములు పర్యవేక్షణలో పలువురు శైవగామ పండితులచేత బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జంపన భీమరాజు (బాబు), ఆలయ ఇఒ బళ్ల నీలకంఠం, ధర్మకర్తల మండలి సభ్యులు గ్రంధి రామలింగేశ్వరరావు, కాలే సహదేవుడు, దూళిపూడి సత్యనారాయణతోపాటు అధిక సంఖ్యలో గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు సందర్భంగా స్వామి అమ్మవార్లను వధూవరులను చేసిన సందర్భంగా మురమళ్ల వాస్తవ్యులు జంపన రామకృష్ణరాజు పట్టువస్త్రాలు సమర్పించారు.