తూర్పుగోదావరి

నాటకం నడక నేర్చిన చోటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 29: గోదావరి ఒడి మరో సారి కళా గోదావరిగా మారింది..రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులు రాజమహేంద్రవరానికి పయనం కావడంతో కళా శోభితమైంది..నాటక రంగ దినోత్సవం నేపధ్యంలో కందుకూరి విశిష్ట, ప్రతిష్టాత్మక పురస్కారాలు, నంది నాటక బహుమతుల ప్రదానోత్సవానికి తెరలేచింది. నేడు వేంకటేశ్వర ఆనం కళా కేంద్రం అవార్డుల ప్రదానోత్సవానికి ముస్తాబైంది..బహుమతులకు రంగాలంకరణ పూర్తయింది.
కళను నమ్ముకున్నవారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. నాటక రంగ దినోత్సవం రోజు అవార్డులు, పురస్కారాలతో సత్కరించడమే కాదు..నిరంతర సేవలు అందించి కళారంగాన్ని అభివృద్ధి చేసి కళాకారులను ఆదుకోవాల్సి వుంది.
సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు నాటక రంగానికి చేసిన సేవలకు గుర్తుగా కందుకూరి జయంతిని ప్రతీ ఏటా నాటకరంగ కళాకారులకు కందుకూరి నాటకరంగ పురస్కారాలను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు రాజమహేంద్రవరం వేదిక రంగాలంకరణ సిద్ధమైంది. రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం సాయంత్రం కందుకూరి విశిష్ట, ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. ఇదే వేదికపై 2016 సంవత్సరం 20వ నంది నాటకోత్సవాల బహుమతి ప్రదానోత్సవాన్ని కూడా నిర్వహించనున్నారు.
ఈ వేదికపై ముగ్గురు కళాకారులకు కందుకూరి రంగస్థల రాష్ట్ర స్థాయి విశిష్ట పురస్కారాలు, 65 మందికి జిల్లాస్థాయి కందుకూరి రంగస్థల ప్రతిష్టాత్మక పురస్కారాల ప్రదానం చేయనునన్నారు. మొత్తం 68 మంది కళాకారులకు నంది బహుమతుల ప్రదానం జరగనుంది. దీంతో పాటు తొలి సారిగా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం కూడా ప్రదానం చేయనున్నారు.
సాంస్కృతిక రాజధానిగా ఉన్న రాజమహేంద్రవరానికి ఈ పురస్కారాల నేపధ్యంలో ఎంతో మంది కళాకారులు హాజరవుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా భారీ ఏర్పాట్లు చేశారు. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర శాసన సభా స్పీకర్ కోడెల శివప్రసాద్, డిప్యూటీ సిఎం నిమ్మకాయల చిన రాజప్ప, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మంత్రి జవహర్ తదితరులు హాజరవుతున్నారు. కందుకూరి విరచిత తొలి నాటకం ఇక్కడే ఆహార్యం పొందింది..నాటకం నడక నేర్చిన చోటే నాటక రంగానికి విశేష కృషి చేసిన కళాకారులకు పురస్కారాలను అందించడం విశేషత సంతరించుకుంది.
సకాలంలో పన్నులు చెల్లించి
దేశ ఆర్థ్దిక వ్యవస్థకు తోడ్పడాలి
జిఎస్టీ ఎడిజి రెహమాన్
కాకినాడ, ఏప్రిల్ 29: వ్యాపారులంతా తమ పన్నులను సకాలంలో చెల్లించి దేశ ఆర్ధిక వ్యవస్ధకు తోడ్పాటు కావాలని జిఎస్టీ అదనపు డైరెక్టర్ ఎస్‌కె రెహమాన్ కోరారు. శనివారం కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో స్ధానిక యంగ్మెన్స్ హ్యేపీక్లబ్‌లో నగరంలోని వ్యాపారులతో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏకీకృత పన్ను (జిఎస్టీ) విధానంపై సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును విశాఖ కస్టమ్స్ కమీషనర్ బి హరేరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ జిఎస్టీ వల్ల ఒకే పన్ను అన్నింటితో కలిపి చెల్లింపులు జరుగుతాయన్నారు. ప్రతీ నెలలో వ్యాపారులు విక్రయించిన వస్తువులకు తర్వాత నెలలోని 20వ తేదీన వివరాలు వెల్లడించాలన్నారు. జిఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్‌కె రెహమాన్ మాట్లాడుతూ వ్యాపారులను ఇబ్బందులను గురి చేయకుండా ఒకే పన్ను విధానం ఈ ఏడాది జులై 1వ తేదీ నుండి అమలులోకి వస్తుందన్నారు. ఈ విధానంపై వ్యాపారులకు అవగాహన కల్పించి వారి అపోహలను తొలగిస్తామన్నారు. గోదావరి ఛాంబర్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి మాట్లాడుతూ ఈ పన్ను విధానంపై ఉన్న అనుమానాలను నివృత్తం చేయాలని సూచించారు. సదస్సుకు కోకనాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు అధ్యక్షత వహించగా వాణిజ్య పన్నుల శాఖ డిసి డి రమేష్, కాకినాడ ఐసిఎఐ ఛైర్మన్ ఎన్ సురేష్, ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జి సాంబశివరావు, శ్రీరాం భగవత్, ఎం సత్యనారాయణ, ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.