తూర్పుగోదావరి

మలేరియా నిర్మూలనకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగవరం, మే 10: మలేరియా నిర్మూలనకు ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని గ్రామాల్లో నిర్వహిస్తున్న మలేరియా దోమల నివారణ మందు స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, వెలుగు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మండల పరిషత్ ప్రత్యేకాధికారి, ఐటిడిఎ ఎపిఒ పిఎస్ నాయుడు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం మలేరియా స్పేయింగ్ కార్యక్రమం నిర్వహణపై అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో ఆయన సమీక్షించారు. మండలంలో గంగవరం, పిడతమామిడి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 17 గ్రామాలను మలేరియా ప్రభావిత గ్రామాలుగా గుర్తించామన్నారు. ఈ గిరిజన గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని వైద్యసిబ్బందికి సూచించారు. దోమల నివారణకు యాంటీలార్వ ఆపరేషన్, నూరుశాతం స్ప్రేయింగ్ ప్రక్రియ విజయవంతం చేయాలన్నారు. దోమ తెరలు సక్రమంగా వినియోగించుకొనే విధంగా గిరిజనులను చైతన్య పరచాలన్నారు. ఎంపిపి తీగల ప్రభ మాట్లాడుతూ వైద్యసిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలల్లో అవగాహన కల్పించాలన్నారు. దోమ కాటు వల్లే మలేరియా వ్యాప్తి చెందుతోందని దోమ తెరలు వినియోగించుకోవాలని స్ప్రేయింగ్ ప్రతీ ఇంటిలో సంపూర్ణంగా చేయించుకొనే విధంగా అన్ని శాఖల సిబ్బంది గిరిజనులను చైతన్యపరచాలన్నారు. తహసీల్దార్ జి చిన్నారావు, ఐసిడిఎస్ సిడిపిఒ ఉష వైద్యాధికారులు ఇందుశ్రీ, సౌజన్య, లిఢియా తదితరులు పాల్గొన్నారు.