తూర్పుగోదావరి

నన్నయ్యలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 10: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు బుధవారం విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో యూనివర్సిటీకి అనుబంధంగా వున్న డిగ్రీ కళాశాలలకు సంబంధించిన ఈ ఫలితాలలో అమ్మాయిలే అధిక శాతం ఉత్తీర్ణత సాధించారని విసి తెలిపారు. బిఎ, బికాం, బిఎస్సీ, బిఎస్సీ హోమ్ సైన్స్, బిఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, బిబిఎం, బిసిఎ విభాగాల్లో మొత్తం 20397 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 10930 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. 2016 ఫలితాల్లో 48.64 శాతం ఉత్తీర్ణత వస్తే.. ఇపుడు అంతకు మించి 53.59 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిందన్నారు. విద్యా విధానాల్లో మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో యూనివర్సిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని విసి అన్నారు. అనంతరం ఈ ఫలితాల్లో వివిధ గ్రూపుల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి మురళీధర్, సిస్టమ్ మేనేజర్ విఎఎం జ్యోతి, సూపరింటెండెంట్ జి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన
ముమ్మిడివరం, మే 10 : ముమ్మిడివరం మండలం కొత్తలంక పంచాయతీ పరిధిలో బొబ్బర్లంక, పల్లంకుర్రు ప్రధాన పంటకాలువపై 84 లక్షల రూపాయలతో నిర్మించే వంతెన నిర్మాణానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువ ఆధునికీకరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న వంతెనను సకాలంలో నాణ్యతతో నిర్మించాలని అధికారులు, కాట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం కొత్తలంక చాకిరేవు చెరువు, సిద్ధార్ధ నగర్ 36 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, పచ్చమట్ల వారిపాలెంలో రూ.7 లక్షలతో నిర్మించిన అంగన్ వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పితాని సత్యనారాయణ, సర్పంచ్ దాసరి సుమలత, మండల టిడిపి అధ్యక్షులు అర్ధాని శ్రీను, దొమ్మేటి రమణకుమార్, నడిమింటి సూర్యప్రభాకరం, తాడి నరశింహారావు, పొత్తూరి విజయభాస్కరవర్మ, దాసరి సాయిబాబు, చిక్కాల అంజిబాబు, దాట్ల పృధ్వీరాజ్, గేదెల రఘునాధబాబా, కోర్ల కామేశ్వరరావు, మిమ్మితి చిరంజీవి, వీపూరి వెంకటసత్యనారాయణరాజు, తాడి జానకిరామ్, దాసరి నాగేశ్వరరావు, గొల్లపల్లి గోపి పాల్గొన్నారు.
ఘనంగా శ్రీలక్ష్మి నరసింహస్వామివారి కల్యాణం
విఆర్‌పురం, మే 10: మండలంలో వడ్డిగూడెం, రాజుపేట, రాజుపేట కాలనీల్లో శ్రీలక్ష్మి నరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తులు బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని ఈ మూడు గ్రామాల్లో ఐదు ప్రదేశాల్లో కన్నుల పండువగా నిర్వహించారు. వడ్డిగూడెం గ్రామంలో ఏకీది వద్ద స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామస్థులు, మండలంలో నలుమూలల నుంచి భక్తులు విశేషంగా హాజరయ్యరు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వేద పండిత పురోహితుల మంత్రోచ్ఛారణలతో, భక్తుల హర్షాద్వానాలతో, మంగళవాయిద్యాలతో, అభిజిత్ లగ్నమందు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు గోదావరి, శబరి జీవనదుల సంగమంలో పవిత్ర స్నానాలు చేసి, కొత్త బట్టలు ధరించి, స్వామివారిని దర్శించుకొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్బంగా ఆలయా నిర్వాహకులు ఆలయాల్లో ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు ఏర్పాటు చేసి, కుర్చీలను ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణం సందర్బంగా కల్యాణ మండపాన్ని అత్యంత అందంగా రంగురంగుల కాగితాలతో, విద్యుత్ దీపాలంకరణతో అందంగా తీర్చిదిద్దారు. కల్యాణాన్ని తిలకించటానికి వచ్చిన భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.