తూర్పుగోదావరి

కలెక్టర్ మిశ్రా సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, మే 10 : జిల్లా కలెక్టర్‌గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కార్తీకేయమిత్ర బుధవారం సఖినేటిపల్లి, మలికిపురం మండలాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించారు. తొలుత అంతర్వేది శ్రీ లక్ష్మీనరశింహాస్వామిని దర్శించుకొని వేద పండితుల ఆశీర్వాదం పొందారు. అనంతరం మినీ పిషింగ్ హార్బర్ సాగర సంగమం, డ్రెడ్జింగ్ హార్బర్ పనులు జరుగుతున్న ప్రదేశాలను ఆయన పరిశీలించారు. అనంతరం మలికిపురం మండలంలోని మలికిపురం, లక్కవరం గ్రామాల్లో నీరు - చెట్టు పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం లక్కవరం పిహెచ్‌సిని సందర్శించి ఓపి రిజిష్టర్‌ను రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా లక్కవరం సర్పంచ్ ఎం అలివేలు మంగతాయారు, జడ్పీటిసి ఎం భూదేవి, ఎంపిపి జి గంగాభవానీలు లక్కవరం ఆసుపత్రి స్థాయి పెంచాలని, 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసారు. అదేవిధంగా పిహెచ్‌సి ప్రాంగణంలో నిర్వహింపబడుతున్న హోమియో డిస్పెన్సరీ ద్వారా వారంమంతా సేవలు అందించేలా అభివృద్ధి చేయాలని కోరారు. స్థానిక మాజీ సర్పంచ్ ఎంవి నరసింహరావు, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అనంతరం అక్కడే ఉన్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మేలు జాతికోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం
ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్
రాజవొమ్మంగి, మే 10: పౌష్టికాహారంతో బాటు అదనపు ఆదాయాన్ని సమకూర్చే మేలుజాతి కోళ్ల పెంపకానికి మన్యంలో ప్రతీ కుటుంబం ప్రాధాన్యత ఇవ్వాలని ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్ అన్నారు. మండంలో జడ్డంగిలో వెలుగు పథకంలో ఏర్పాటు చేసిన మదర్ పౌల్ట్రీ యూనిట్‌ను బుధవారం పిఒ ప్రారంభించి కోడి పిల్లలను పరిశీలించారు. ఢిల్లీ నుండి తీసుకొచ్చిన ఒక రోజు వయస్సున్న కోడి పిల్లలను 21 రోజులు ఈ యూనిట్‌లో పెంచుతారని, అనంతరం మహిళలకు పిల్లలను ఆందజేస్తారని, 21 వారాలు పెంచిన తరువాత 200 రోజుల వరకు నిరంతరాయంగా గుడ్లు పెడతాయని, తొలి దశలో 3వేల పిల్లల్ని పెంచుతున్నామని పిఒ వెల్లడించారు. రక్తహీనతతో బాధ పడుతున్న గిరిజన కుంటుంబాలకు ఈ పౌష్టికాహారం ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ యూనిట్ ఏర్పాటుకు సెర్ఫ్ నుండి 5లక్షల రూపాయలు మంజూరయ్యాయి. జడ్డంగి-గొబ్బిలమడుగు రహదారి పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు పిఒవొ దృష్టికి తీసుకురాగా బైక్‌పై ఆప్రాంతానికి వెళ్లి రహదారిని పరిశీలించారు. ఘాట్ రోడ్డు ఉండడంతో 1100మీటర్ల బిటి రహదారి నిర్మాణం గత రెండేళ్లుగా నిలిచిపోయింది. వెంటనే రహదారి పని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బి అధికారులను పిఒ ఆదేశించారు. రేవటిపాలెం వద్ద నిరుపయోగంగా ఉన్న ఉపాధి హామీ పథకంలో నిర్మించిన పశువుల నీటితొట్టెను పరిశీలించి అధికారులను మందలించారు. వెలుగు ఎపిడి విజయకుమార్, ఎంపిపి నూకరత్నం, సర్పంచ్ మురళీకృష్ణ, ఎంపిడిఒ కెఆర్ విజయ, ఎపియం నీలి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ్ఛయా సోమేశ్వర స్వామి వారి శ్రీ చక్రస్నానం
రామచంద్రపురం, మే 10: కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ్ఛయా సోమేశ్వర స్వామి వారి దివ్య తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా శాస్త్రోక్తంగా బుధవారం స్వామి వార్ల శ్రీచక్రస్నాన కార్యక్రమం గౌతమీ గోదావరి నదిలో భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వార్ల తిరుకల్యాణ మహోత్సవం ఇటీవల జరిగిన విషయం పాఠకులకు విదితమే. ఆలయ కార్యనిర్వహణాధికారి కె రామచంద్రరావు, అనువంశిక అర్చక స్వాముల నేతృత్వంలో శ్రీ స్వామి వారు, అమ్మవార్లను పల్లకిలో ఉంచి, మేళతాళాలతో గౌతమీ గోదావరికి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అర్చక స్వాములు శ్రీ స్వామివార్లను గౌతమీ గోదావరి నదిలో శ్రీ చక్రస్నానం చేయించిన అనంతరం మరలా ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి, శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.