తూర్పుగోదావరి

ఈదురు గాలులు: కూలిన భారీ వృక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగంపేట, మే 14: అసలే వేసవి కాలం..వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలకు ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో కలవరపడ్డారు. రంగంపేట నుండి అటు వడిశలేరు, ఎస్‌టి రాజాపురం, ఇటు కోటపాడు, రామేశ్వరంపేట ఎడిబి రోడ్డు వెంబడి చెట్లు కూలి సుమారు మూడు గంటల వరకూ ట్రాఫిక్ స్తంభించింది. చుట్టుపక్కల ప్రజలు, ప్రయాణీకులు, రంగంపేట పోలీసుల చొరవతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు చెట్ల కొమ్మలను విరవగా, పొక్లయినుతో చెట్లను తొలగించారు. దీంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. వివిధ గ్రామాల్లో పూరిపాకలు, ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఇళ్ల ముందు వేసుకున్న తాటాకు పందిర్లు, బోర్డింగ్‌లు గాలికి ఎగిరిపోయాయి. మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు చర్యగా విద్యుత్తు సరఫరా నిలిపివేయగా వైర్లు తెగిపడటంతో రాత్రి 8 గంటలైనా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు.
సామర్లకోట: ఆదివారం ఉదయం నుండి సాయంత్రం 4.30 నిమిషాలకు వరకూ పట్టణంలో నిప్పుల కొలిమి మాదిరిగా భానుడు తన ప్రతాపం చూపాడు. దాంతో పట్టణ ప్రజలు తీవ్రంగా అల్లాడి పోయారు. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో బయటకురావడానికి సైతం ప్రజలు సాహసించలేదు. సాయంత్రం 4.30 గంటలకు ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులుకమ్మి భారీ ఈదురు గాలులు వీచాయి. తేలికపాటి జల్లులు పడ్డాయి. దాంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు కొంతేమర సేద దీరారు. అయినప్పటికీ రాత్రి 8 గంటలకు కూడా ఎండ వేడిమి ప్రభావం కొనసాగింది. భారీ ఈదురు గాలులు సందర్భంగా పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరరాయం ఏర్పడింది. సాయంత్రం 4.30 నిమిషాలనుండి 7.30 నిమిషాల వరకూ మూడు గంటలు పైబడి కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం మీద వేసవి తాపం నుండి ప్రజలు కొంత ఉప శమనం పొందారు.
మాదిగ ఉద్యోగుల సన్నాహక జాతీయ సదస్సు
రాజమహేంద్రవరం, మే 14: జూలై 7వ తేదీన ఎపి రాజధాని అమరావతిలో కురుక్షేత్ర మహా సంగ్రామ మహాసభ నేపధ్యంలో మాదిగ ఉద్యోగుల సన్నాహక జాతీయ సదస్సు నిర్వహించారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ సదస్సు రాజమహేంద్రవరం ఆర్ అండ్ అతిథి గృహంలో ఆదివారం మాదిగ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు జెఇ ప్రసాద్ బాబు అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు గోపాల్‌బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హాజరయ్యారు. కురుక్షేత్ర సంగ్రామ మహాసభ దిశానిర్ధేశం చేశారు. ఈ సంగ్రామ మహాసభను జయప్రదం చేసి మాదిగల సత్తా చాటాలన్నారు. కురుక్షేత్ర విజయానికి ఐదు నిముషాలు కూడా వృథాకాకుండా కృషి చేయాలన్నారు. ఈ జాతీయ సదస్సులో జాతీయ అధ్యక్షుడు కెకె ప్రసాద్‌బాబు, రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు టివి శ్రీ్ధర్, వైస్ ప్రెసిడెంట్ పెందుర్తి సునీల్, జనరల్ సెక్రటరీ పెంకే వెంకట్రావ్, తెలుగు, తమిళ, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొన్నారు.
1420 కేజీల గంజాయి పట్టివేత: ఇద్దరు అరెస్టు
చింతూరు, మే 14: లారీలో తరలిస్తున్న 1420 కేజీల గంజాయిని ఆదివారం ఉదయం ఎటపాక సిఐ రవికిరణ్, పోలీసు సిబ్బందితో దాడిచేసి పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేశారు. సిఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం..ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి ప్రాంతం నుంచి పూణేకు గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. సిఐ రవికిరణ్ సిబ్బందితో కలిసి నెల్లిపాక సెంటర్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న లారీని తనిఖీ చేయగా అందులో 1420 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న బబ్బీఖాన్, అంకిత్‌లను పోలీసులు అరెస్టుచేశారు. గంజాయిని తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా.
కష్టపడి చదివితేనే లక్ష్యసాధన సాధ్యం
రైల్వే డిఎస్పీ మోకా

అమలాపురం, మే 14: లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపనకు హార్డ్ వర్క్ తోడైతే ఎంతటి లక్ష్యాన్నైనా సులభంగా చేధించవచ్చని విజయవాడ రైల్వే డిఎస్పీ మోకా సత్తిబాబు అన్నారు. ఆదివారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో తమ సంస్థలో ఉచిత శిక్షణ పొందిన 12 మహిళలు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. తమ సంస్థలో ఉచిత శిక్షణ పొందిన అభ్యర్ధుల్లో 30 మంది ప్రిలిమ్స్ ఎంపిక కాగా వారిలో 12మంది ఫైనల్ పరీక్షలో విజయం సాధించారన్నారు. ఈసందర్భంగా ఉద్యోగాలు కైవశం చేసుకున్న అభ్యర్థులను ఆయనతోపాటు పలువురు అభినందించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తోటి పేద విద్యార్థులకు తమ తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కోచింగ్ క్యాంపు నిర్వహణకు సహకరించిన రాజమండ్రి ఓఎన్‌జిసి ఎసెట్‌వారికి, పూలే అంబేద్కర్ యూత్, రూలర్ విలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంపవర్‌మెంటు ఫౌండేషన్, పివి రావు మెమోరియల్ సొసైటీ, ఎస్సీ ఎంప్లారుూస్, జిల్లా బిసి ఉద్యోగుల సంఘం, పిఇటి అసోసియేషన్‌లకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి పటేల్ బాబు, గెడ్డం ప్రదీప్, పాయిసం శ్రీనివాస్, ఉండ్రు సత్యనారాయణ, ఎజెఎస్ రాజ్‌కుమార్, గొసంగి బంగార్రాజు, గన్నవరపు శ్రీను, దాసరి సత్తిబాబు, నేరేడిమిల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.