తూర్పుగోదావరి

జల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 12: జిల్లాలో జల సంరక్షణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర జల వనరుల శాఖ, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఇందుకోసం వచ్చే నెలలో కాకినాడలో జల వనరులపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. రానున్న రెండు నెలల్లో జల సంరక్షణ చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అచ్చంపేటలో ఒక ఫంక్షన్ హాలులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించేందుకు మంత్రి దేవినేని, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలసి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా 46 గొలుసు చెరువులను అభివృద్ధి చేస్తామని, 190 చెరువుల్లో పూడిక తీత, గట్టను పటిష్టం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి చెరువుకు 10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రేషన్ సరుకులకు సంబంధించి లబ్ధిదారులకు అనువైన సమయాలలో పంపిణీ చేసే విధంగా చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండో పంటకు సాగు నీటి ఎద్దడి వచ్చినప్పటికీ సమర్ధవంతంగా నీటిని సరఫరా చేశామని, ఈ కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో మూడు పంటలు పండించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకునే చర్యలపై వచ్చే సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలిపారు. ఇటువంటి సమావేశాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్వహించనున్నట్టు దేవినేని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించేందుకు వీలుగా ఎన్టీఆర్ జలసరి పేరుతో పెద్ద ఎత్తున నీటి కుంటలు తవ్వుతున్నామని పేర్కొన్నారు. కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆయా గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిందిగా ఎంపిడిఒలను ఆదేశించామన్నారు. జిల్లాలో వివిధ ఇళ్ళ స్థలాలను నీరు-చెట్టు కార్యక్రమం క్రింద లెవెలింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే బిల్లుల చెల్లింపునకు అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీలు కలిదిండి రవికిరణ్‌వర్మ, అంగూరి శివకుమారి, ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎస్‌విఎస్‌ఎన్ వర్మ, వేగుళ్ళ జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి, బిసి కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రవౌళి, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, బండారు సత్యానందరావు, పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.