తూర్పుగోదావరి

వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, మే 15: వేసవి సందర్భంగా దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు ఎస్పీ ఎఆర్ దామోదర్ హెచ్చరించారు. వేసవి కారణంగా రాత్రి సమయాల్లో వేడిని తట్టుకోలేక చాలామంది ప్రజలు ఇంటి తలుపులు తెరచి ఆదమరచి నిద్రించడం జరుగుతోందన్నారు. ఇదే అవకాశంగా తీసుకుంటున్న చోరులు ఇండ్లలోకి చొరబడి చోరీలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి రాత్రి సమయాల్లో ఇంటి తలుపులు తెరచి నిద్రించరాదని హెచ్చరించారు. ముఖ్యంగా ఇండ్లలోని బీరువాలకు చాలామంది తాళాలు వేయకుండా ఉంటున్నారనే విషయం తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందని ఎఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. విలువైన వస్తువులు, నగదును బీరువాల్లోనే దాచుకునే అవకాశం ఉన్న కారణంగా బీరువా తాళాలు వేసుకోవాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఇతర ప్రాంతాలకు తాత్కాలికంగా వెళ్లాల్సి వచ్చిన సమయంలో తమ ఇంటివద్ద బంధువులు, స్నేహితులను కాపలాగా నియమించుకోవాలని, లేనిపక్షంలో స్థానిక పోలీసులకు సమాచారం అందజేస్తే పోలీసులు నిఘాను ఉంచడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ విధంగా చేయడం వలన ఆ ఇండ్లలో చోరీలను అరికట్టడానికి పోలీసులకు వీలవుతుందని అదనపు ఎస్పీ దామోదర్ తెలిపారు. వేసవి కాలంలో చోరీలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇంటిలిజెన్స్ సిఐగా రమేష్
కాకినాడ రూరల్, మే 15: ఇంటిలిజెన్స్ విభాగం కాకినాడ సర్కిల్ ఇనె్స్పక్టర్‌గా నూని రమేష్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం అర్భన్ ట్రాఫిక్ సిఐగా పనిచేస్తున్నారు. 22 మంది ఎస్‌ఐలకు పదోన్నతి రాగా అందులో రమేష్ ఒకరు. గతంలో ఆయన కరప కాకినాడ ట్రాఫిక్ విభాగాల్లో పనిచేశారు. సమర్ధవంతమైన అధికారిగా రమేష్ గుర్తింపు పొందారు. అంతకుముందు ఆయన విజయవాడలో యాంటీ గుంఢాస్క్వాడ్‌లో పని చేసి సంఘ విద్రోహ శక్తులకు సింహస్వప్నంలా నిలిచారు. 100కు పైగా అవార్డులు రివార్డులను ఆయన పొందారు. రమేష్ ఇంటిలిజెన్స్ సిఐగా మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
బాలురతోపాటు బాలికలకు సమాన గౌరవం ఇవ్వాలి
ఆలమూరు, మే 15:సమాజంలో బాలికలను బాలురతోపాటు సమానంగా గౌరవించాలని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం బాలికలచదువుకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతుందని మండలి డిప్యూటి ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. మండల కేంద్రమైన ఆలమూరు శ్రీ బొబ్బా జయశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం 800 సైకిళ్లను ఐదు ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆ పాఠశాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ చిన్నారులను వంట గదులకే పరిమితం చేయకుండా చదువులమ్మ ఒడికి పంపాలని అప్పుడే మహత్మ గాంధీజీ కలనిజమవుతుందని అన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారీశ్రామిక వేత్త వంటిపల్లి పాపారావు 2017-18 సంవత్సరంలో పదిలో పది పాంట్లు సాధించిన విద్యార్థులకు యాభైవేల రూపాయలను ఆయన చేతులు మీదుగా పంపిణీ చేశారు. అలాగే ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం సొంత నిధుల నుండి మరో ఇరువైవేల రూపాయలను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక పిఎసిఎస్ బ్రాంచిలో ఆలమూరుకు చెందిన ఇద్దరికి మత్స్య శాఖ సొసైటీ అధ్వర్యంలో లక్ష రూపాయలు విలువ చేసే రెండు టివిఎస్ మోటారు సైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే మండలం గల రేషన్ షాపుల్లో నగదు రహిత లావాదేవీలు చేసిన ఐదుగురు మహిళలకు స్మార్ట్ సెల్‌ఫోన్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఈదర సత్యనారాయణ (నల్లబాబు), రాయుడు సూరిబాబు, వంటిపల్లి సతీష్, తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరావు, ఎండిఓ నాతి బుజ్జి, ఎంఇఓ రాజేశ్వరావు, ఎంపిపి శ్రీను, యుటిఎఫ్ చైర్మెన్ వైవివి రమణ, పిఆర్‌టియు ఎం రాజగోపాల్, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు కొత్తూరి వీరన్ననాయుడు పలువురు పాల్గొన్నారు.