తూర్పుగోదావరి

రాజమహేంద్రి కౌన్సిల్ రసాభాస..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 15: మూడు నెలల తర్వాత జరిగిన రాజమహేంద్రవరం కౌన్సిల్ సాధారణ సమావేశం రసాబసాగా సాగింది. మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన సోమవారం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ప్రాంగణంలోని క్రొవ్విడి లింగరాజు కౌన్సిల్ హాలులో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష వైసిపి కార్పొరేటర్ల అనుసరించిన తీరుపై మేయర్ రజనీ శేషసాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తర సమయం కోసం డిమాండ్ చేసిన వైసిపి మేయర్ అందుకు అంగీకరించినప్పటికీ సభకు ఆధ్యాంతం అడ్డుపడుతూనే వ్యవహరించారు. శాసన సభా సమావేశానికి హాజరు కావాల్సిన రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ముందుగా కౌన్సిల్‌లో మాట్లాడేసి వెళ్తారని మేయర్ ఆదేశించిన నేపధ్యంలో ఎమ్మెల్యే మాట్లాడే క్రమంలో వైసిపి సభ్యులు పెద్ద ఎత్తున గొడవ లేవదీశారు. ఈ క్రమంలో సమావేశంలో సుమారు 40 నిముషాల పాటు తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం ఎమ్యెల్యే మాట్లాడేసి సమావేశం నుంచి వెళ్లారు. ఆ తర్వాత కూడా వైసిపి సభ్యులు మింది నాగేంద్ర, ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డితో పాటు మిగిలిన సభ్యులంతా సమావేశానికి అడ్డుతగులుతూనే వున్నారు. ప్రశ్నోత్తర సమయం ఇస్తామని మేయర్ చెప్పినప్పటికీ వైసిపి కార్పొరేటర్ మింది నాగేంద్ర సభలో గొడవ చేస్తూనే వున్నారు. దీంతో మేయర్ రజనీ శేషసాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు మూడు సార్లు సభలో ఉంటే ఉండండి..లేదంటే బయటకు వెళ్ళిపోండి అంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇటు మేయర్‌తో వైసిపి సభ్యులు వాగ్వాదానికి దిగారు. మరో వైపు వైసిపి సభ్యులతో తెలుగుదేశం డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో వైసిపి సభ్యుడు మింది నాగేంద్ర ఎంతకీ సభకు సహకరించే పరిస్థితి కన్పించకపోవడంతో మేయర్ ఆదేశంతో కార్పొరేషన్ సిబ్బంది ఆయనను బయటకు తీసుకెళ్ళిపోయారు. ఆయనకు మద్ధతుగా వైసిపి కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, గుత్తుల మురళీధర్, ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేశారు.
వేసవిలో తాగునీటి సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలి

కలెక్టర్ మిశ్రా
కాకినాడ సిటీ, మే 15: వేసవి సందర్భంగా జిల్లా ప్రజలకు తాగునీటి సమస్యలేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా పరిషత్, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ శాఖల అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. వేసవి సందర్భంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణ, ప్రజల ఆరోగ్య రక్షణ కార్యక్రమాలను కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో నీటి వనరులతో తగినంత నీటి లభ్యత ఉన్న గ్రామాలు, వనరులున్నా అవసరమైనంత నీరు అందుబాటులో లేని గ్రామాలు, కేవలం బోర్‌వెల్స్‌పై ఆదారపడిన గ్రామాల వివరాలను వెంటనే అందజేయాలన్నారు. ఈవిషయాలపై సంబంధిత శాఖల అధికారులు సిఆర్‌ఎఫ్ పద్దు క్రింద కేటాయించిన 73.59లక్షల నిధులతో బోర్ వెల్స్ ఏర్పాటుకు మంజూరుచేసిన 958పనుల్లో 698పనులను పూర్తి చేసినట్లు వివరించారు. పురోగతిలో ఉన్న మరో 206పనులను యుద్ద ప్రాతిపదికపై చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు వేరే ప్రత్యామ్నాయం లేని ఆవాసాలన్నిటికీ రానున్న 20రోజుల్లో రవాణా ద్వారా మంచినీటిని సరఫరాచేయాలని సూచించారు. చలి వేంద్రాలు ద్వారా త్రాగునీరు, మజ్జిగను సరఫార చేయడంతోపాటు, ఉపాధి పనులు ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నాం 11.30గంటలలోపు ముగించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 7.30గంటలకే తెరచి 11గంటలకు పిల్లలు ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మిశ్రా కోరారు. రానున్న 5రోజులు వడగాలులు, తీవ్రమైన ఉష్టోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈసమావేశంలో జేసి-2 జె రాధాకృష్ణమూర్తి, జడ్పీసిఇఒ కె పద్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
అక్రమ రొయ్యల చెరువులు మూసివేయాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య
కాకినాడ, మే 15: జిల్లాలో సారవంతమైన భూముల్లో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులను మూసివేయాలని డిమాండు చేస్తూ బిజెపి కిసాన్ మోర్జా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి అధ్యక్షుడు జిల్లా యెనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని కోనసీమ, తుని, ముమ్మిడి వరం, అనపర్తి, పిఠాపురం, కాకినాడ రూరల్ వంటి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా రొయ్యల చెరువులను తవ్వి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారన్నారు. దేవాదాయ శాఖకు చెందిన భూముల్లో అక్రమ చెరువుల తవ్వకాలను బట్టి అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో తెలుస్తోందన్నారు. సారవంతమైన భూముల్లో రొయ్యల చెరువులు తవ్వకంవల్ల భవిష్యత్తులో పంటలు పండే అవకాశం ఉండదని మాలకొండయ్య ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి చేస్తున్న ధర్నాకు అక్కడే ఉన్న డిసిసి మాజీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు మద్దతు తెలిపారు. ఈ ధర్నాలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెండెం బాబ్జి, బిజెపి నాయకులు కర్రి చిట్టిబాబు, మచ్చా ప్రసాద్, పడాల రఘు, కె గంగరాజు, భీమశంకర్, దిలీప్‌కుమార్ సదనాని, తుమ్మల పద్మ, కర్రి పాపారావు, దుగ్గుదుర్రు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.