తూర్పుగోదావరి

తిరుపతి బ్రహ్మోత్సవాలకు ఇస్తర కావిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: పత్రం, పుష్పం, ఫలం, తోయం.. భగవద్గీత శ్లోకం ఆదర్శంగా తీసుకుని కోరుకొండ శ్రీచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుండి జరగనున్న బ్రహ్మోత్సవాలలో స్వామి వారికి లక్ష ఇస్తర్లు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి సమర్పించనున్నారు. గత ఆరు సంవత్సరాలుగా పత్రం పరమాత్మకు సమర్పయామి అనే ఈ ధార్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అయిదు జిల్లాల నుండి 300 మంది భక్తులు రెండు నెలలపాటు వెదురు ఈనెలతో ఓం నమో వెంకటేశాయ మంత్ర స్మరణతో ఆకులను ఇస్తర్లు తయారుచేసి జపం అనే పత్రం (ఇస్తర) స్వామి వారికి సమర్పిస్తున్నట్టు తెలిపారు. మంగళవారం స్థానిక పుష్కరఘాట్‌లో ఈ లక్ష ఇస్తర్లు ఉంచి వెంకటేశ్వర, పద్మావతి అష్టోత్తరాలు పఠనం అనంతరం గోవింద నామస్మరణ నడుమ అన్నమయ్య ఇస్తర్ల కావిడి తిరుమల బయలుదేరింది. అన్నమయ్య, వెంకటేశ్వర రూపాల వేషధారణతో సంకీర్తనలు ఆలపిస్తూ ధార్మిక కార్యక్రమం సాగింది. శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ నిర్వహించారు. 200 శ్రీవారి సేవకులు తిరుమల బయలుదేరారు. తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంలో ఆకులు వేయడం, తీయడం సేవ నిర్వహించనున్నారు.
విస్తృతంగా కల్వర్టుల తనిఖీ
రాజవొమ్మంగి, సెప్టెంబర్ 19: మావోయిస్టులు మందుపాతరలు అమర్చే అవకాశమున్నందున ముందు జాగ్రత్తగా పోలీసులు మంగళవారం మన్యంలో విస్తృతంగా కల్వర్టుల తనిఖీ చేపట్టారు. జడ్డంగి నుండి సింగంపల్లి వరకు ఆర్‌అండ్‌బి రహదారి కింద ఉన్న కల్వర్టులను, వంతెనలను నిశితంగా పరిశీలించారు. మావోయిస్టులు విధ్వంసాలు సృష్టించేందుకు కల్వర్టు కింద మందుపాతరలు, క్లైమోర్ మైన్స్ అమర్చే అవకాశమున్నందున రోడ్ ఓపెనింగ్ పార్టీ సహాయంతో తనిఖీలు చేపట్టారు. కల్వర్టుల సమీపంలో తుప్పలు పెరిగిపోవడంతో జెసిబి సహాయంతో వాటిని తొలగించారు. ఆర్‌అండ్‌బి శాఖ చేయవలసిన తుప్పల తొలగింపు తాము చేస్తున్నామని జడ్డంగి ఎస్సై వెంకట్‌నాగార్జున అన్నారు. అన్ని కల్వర్టుల వద్ద మొక్కలను, తుప్పలను తొలగించారు. ఎపిఎస్‌పి, లోకల్ సాయుధ పోలీసులు ఈ కార్యక్రమంలోపాల్గొన్నారు.

బ్లాక్‌స్పాటుల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటుచేయాలి
*కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ, సెప్టెంబర్ 19: జిల్లాలో అన్ని ప్రధాన రహదారుల్లో ప్రమాదాలు జరుగుతున్నా బ్లాక్‌స్పాట్ ప్రదేశాల్లో హెచ్చరికల బోర్డులు విధిగా ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా రహదారి భద్రత సమావేశం కలెక్టర్ మిశ్రా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే చోట్ల వాటి నివారణకు రంబుల్ స్ట్రిప్‌లను ఏర్పాటు చేయాలన్నారు. హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్‌లను వచ్చే నెల 20వ తేదీలోగా పూర్తి చేసి సమావేశంలో చెప్పాలన్నారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ మాట్లాడుతూ వాహన చోదకులకు రహదారులపై హెచ్చరిక బోర్డులను 100 మీటర్ల దూరం నుండే కనిపించే విధంగా ఉండాలన్నారు. రాజమహేంద్రవరంలో అన్ని ప్రమాదాల జరిగే ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు తగ్గాయని అర్బన్ ఎస్పీ బి రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి విజయరామరాజు, ఐటిడిఎ పిఒ దినేష్‌కుమార్, డిటిసి సిరి ఆనంద్, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ సిఎస్‌ఎన్ మూర్తి, ఎన్‌హెచ్ అధికారి వెంకటరత్నం పాల్గొన్నారు.