తూర్పుగోదావరి

టిడిపితోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, సెప్టెంబర్ 19: రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్‌అండ్‌బి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలంలో వెలమకొత్తురులో సుమారు 1.34 కోట్ల అభివృద్ది పనులకు వారు మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం అదనపు తరగతి గదులను, అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికి అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, ఎఎంసి చైర్మన్ యనమల కృష్ణుడు, తాండవ సుగర్స్ చైర్మన్ ఎస్‌ఎల్ రాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పోల్పాటి శేషగిరిరావు, మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చోడిశెట్టి త్రిమూర్తిస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇక వినూత్న పద్ధతిలో ధాన్యం సేకరణ
*దళారుల నివారణకు చర్యలు: జెసి మల్లికార్జున

కాకినాడ, సెప్టెంబరు 19: దళారులపై వేటు వేసే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఇక నుండి వినూత్న పద్ధతిలో ధాన్యం సేకరణకు రంగం సిద్ధం చేస్తోంది. ఒకే ఫోన్ కాల్‌తో ధాన్యం కళ్ళెం వద్దకే తేమ కొలిచే యంత్రం, సంచార ధాన్యం కొనుగోలు ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎ మల్లిఖార్జున మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తాజాగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. గతంలో రైతులు తాము పండించిన ధాన్యం నుండి ఓ కిలో ధాన్యం నమూనాను ధాన్యం కొనుగోలుకు తీసుకువచ్చి అక్కడి సిబ్బందిచే తేమ శాతాన్ని నిర్ధారణ చేయించుకునేవారని పేర్కొన్నారు. తర్వాత రైతులే కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని రవాణా చేసుకునేవారని చెప్పారు. ఇకనుండి రైతులు ధాన్యాన్ని అమ్మకానికి సిద్ధం చేసిన తర్వాత ఒక్క ఫోన్ చేస్తే ప్రస్తుతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటుచేసిన సంచార ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బంది రైతు కళ్ళం దగ్గరకే నేరుగా చేరుకుంటారన్నారు. తేమ నిర్ధారణ యంత్రాన్ని కళ్ళం వద్దకు తీసుకువెళ్ళి, తేమ శాతాన్ని పరిశీలించి, ధాన్యం నాణ్యతను కూడా అక్కడికక్కడే నిర్ధారిస్తారన్నారు. రైతులకు ఏ విధమైన రవాణా ఖర్చులు లేకుండా, కళ్ళాల నుండే ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. సదరు విధానం వలన దళారుల ప్రమేయాన్ని అరికట్టవచ్చని, నేరుగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను రైతులకు అందించేందుకు వీలవుతుందన్నారు. రైతుల సెల్‌ఫోన్లకు కొనుగోలు కేంద్రం, తేమ యంత్ర సమాచారాన్ని పంపుతామని జెసి తెలిపారు. జిల్లాలో 2,23,926 హెక్టార్లలో వరి సాగు జరిగిందని, 12,17,598 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. దీని ప్రకారం రైతుల అవసరాలకు, స్థానికంగా వినియోగించుకునే బియ్యం రకాలను మినహాయించగా 10,95,838 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. జిల్లాలో గతంలో నిర్వహించిన 284 ధాన్యం కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. 2017-18సంవత్సరానికి క్వింటాలుకు మద్దతు ధర గ్రేడ్-ఎకు 1590, 75 కేజీల బస్తాకు 1192.50 వంతున చెల్లిస్తామన్నారు. సాధారణ రకం క్వింటాలుకు 1550, 75 కేజీలకు 1162.50 రూపాయల వంతున చెల్లిస్తారని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇతర వివరాలకు జిల్లా కేంద్రం కాకినాడలోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన 0884-2354341 ఫోన్ నంబరుకు ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల్లోగా సంప్రదించాలని జెసి మల్లిఖార్జున వివరించారు.