తూర్పుగోదావరి

నేడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: దశాబ్దాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం దేవీచౌక్ దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. దేవీచౌక్ సెంటర్‌లో దేవీ అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సం బుధవారం రాత్రి వైభవంగా జరగనుంది. దేవీచౌక్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది ఉత్సవాలకు అత్యంత వైభవంగా ఏర్పాట్లు పూర్తి చేసింది. 20వ తేదీన అమ్మవారిని నెలకొల్పిన దగ్గర నుంచి రోజువారీ విశేష పూజలతో దేవీచౌక్ అంతా ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. దాదాపు తొంభై ఏళ్లుగా నిర్విరామంగా నిర్వహిస్తోన్న దేవీచౌక్‌లో ఏటికేడాది కొత్తదనం అన్నట్టుగా మరింత దిగుణీకృతమైన ఉత్సవ శోభతో ఈ ఏడాది అత్యంత వైభవంగా ఉత్సవాలు మొదలవుతున్నాయి. సినిమాలకు సెట్టింగులు వేసే ప్రత్యేక బృందాలను తీసుకొచ్చి అత్యంత వైభవంగా సెట్టింగ్‌లు వేశారు. గత నెల రోజులుగా జరిగిన ఏర్పాట్లు మంగళవారంతో పూర్తయ్యాయి. కనులు మిరమిట్లు గొలిపే విధంగా అత్యాధునిక విధానాల్లో విద్యుద్దీపాలంకరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణంతోపాటు దేవీచౌక్ ప్రాంతమంతా ఉత్సవ శోభతో మెరిసిపోతోంది. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 20వ తేదీ నుంచి వివిధ విశిష్ట కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ప్రసిద్ధ నాటక సమాజాలకు చెందిన వివిధ పౌరాణిక నాటకాల ప్రదర్శన ఏర్పాటుచేశారు. చింతామణి, రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర వంటి భారీ నాటకాల ప్రదర్శన దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 20వ తేదీన రాత్రి 11.34 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరగనుంది. 21వ తేదీన తెల్లవారుజాము 5.04 గంటలకు కలశ స్థాపన జరగనుంది. 24వ తేదీన 108 మంది దంపతులు అమ్మవారికి కుంకుమార్చన వైభవంగా జరగనుంది. దేవీచౌక్ అమ్మవారిని దర్శించుకుని తరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగానే భక్తజనం తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.
రైతులకు మరింత చేరువగా రెవిన్యూ సేవలు
పులిమేరులో రైతుసేవలో రెవిన్యూ శాఖను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
పెద్దాపురం, సెప్టెంబర్ 19: రైతులకు రెవిన్యూ శాఖ సేవలను మరింత చేరువ చేసేందుకు రైతు సేవలో రెవిన్యూ శాఖ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. మండలంలోని పులిమేరు గ్రామంలో ఆర్డీవో వల్లూరి విశే్వశ్వరరావు అధ్యక్షతన జరిగిన రైతు సేవలో రెవిన్యూ శాఖ కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 17వేల కోట్ల మేరకు రైతు రుణాలను రెండు విడతలుగా మాఫీ చేశామని, త్వరలోనే మూడో విడత నిధులు విడుదల చేస్తామన్నారు. నదుల అనుసంధానం ద్వారా రైతాంగానికి సాగునీరు అందించేందుకు బృహత్తరమైన కార్యక్రమం చేపట్టామన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా గోదావరి జిల్లాలకు ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రైతాంగానికి అవసరమైన అన్ని రకాల సేవలు రైతుసేవలో రెవిన్యూ శాఖ పథకంలో అందుబాటులోనికి తెచ్చామన్నారు. డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాలు, 1బి ఫారాలు, అడంగళ్, యాజమాన్య హక్కులు బదిలీ, భూ కొనుగోళ్లు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్ సమస్యలు, సరిహద్దులకు సంబంధించి సమస్యల పరిష్కారం వంటి సేవలను రైతులు ఈ పథకం ద్వారా అధికారుల నుండి ఉచితంగా పొందవచ్చన్నారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రత్యేక రెవిన్యూ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ చిక్కాల మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తూ పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుందన్నారు. త్వరలోనే పోలవరం పూర్తి చేస్తామన్నారు, రాష్ట్రంలో మరో 28 ప్రాజెక్టులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రైతుల పక్షపాతిగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరింత సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తుమ్మల అజ్ఞావతి, సూర్యకృష్ణమూర్తి, ఎంపిటిసి అరుణ, తహసీల్దార్ వరహాలయ్య, విఆర్వోలు పాల్గొన్నారు.