తూర్పుగోదావరి

ఏలేశ్వరంలో డెంగ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలేశ్వరం, సెప్టెంబర్ 21: ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన సామంతుల వారి వీధిలో డెంగ్యూ కేసు తొలిసారిగా నమోదైంది. వైద్యాధికారులు తెలిపిన సమాచారం ప్రకారం..ఏలేశ్వరంలోని సామంతుల వారి వీధిలో నివసిస్తున్న తూమురోతు శ్రీరాములు బంధువుకి పాము కుట్టగా అతను కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుసుకున్న శ్రీరాములు జ్వరంతో పరామర్శించేందుకు వెళ్లాడు. జ్వరంతో ఉన్న ఇతనిని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో రక్త నమూనాను పరీక్షకు అతని బంధువులు ఇవ్వగా, అతనికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు గుర్తించి ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి వివరాలను గురువారం పంపించారు. శ్రీరాములను వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి స్థానిక వైద్యులు తరలించారు. అనంతరం సిహెచ్‌సి వైద్యాధికారి ఎవి రమణ ఆధ్వర్యంలో వైద్య బృందం సామంతులవారి వీధిలో ఉన్న అతని ఇంటిని పరిశీలించారు. అక్కడ ఉన్న నీటి నిల్వలను తొలగించి క్లోరినేషన్ చేయించారు. ఈ మేరకు నగర పంచాయతీ కమిషనర్ ఎం ఏసుబాబుకు, శానిటేషన్ అధికారి ఎం ప్రసాద్‌కు వైద్య ఆరోగ్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపిహెచ్ ఇఒ కె భాస్కరరావు, ఎంపిహెచ్‌ఎస్ వీరన్న, ఎస్‌యుఒ ఆనంద్, ఎంపిహెచ్ ఎఎం బి రాజేంద్రప్రసాద్, ఎఎన్‌ఎం ఎన్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ వివరణ
సామంతుల వారి వీధిలో నమోదైన డెంగ్యూ కేసుపై కమిషనర్ ఎం ఏసుబాబు స్పందిస్తూ నగర పంచాయతీ పరిధిలోని 19వార్డులలో మురుగు కాలువల క్లీనింగ్, పారిశుద్ధ్య లోపాలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే వీధులను శుభ్రం చేయించినట్టు చెప్పారు. కాగా నేటి నుంచి సామంతుల వారి వీధి, పరిసర ప్రాంతాలలో నివసించే వారి రక్త నమూనాలను సేకరిస్తామని వైద్యాధికారి రమణ తెలిపారు.