తూర్పుగోదావరి

రెండు గంటలు అంధకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: హిందూజా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరాలో విఘాతం కలిగింది. విశాఖలోని హిందూజా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఇపిడిసిఎల్ పరిధిలో ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంటుంది. 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తడంతో విద్యుత్ సరఫరాలో లోటు వచ్చింది. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి రెండేసి గంటల పాటు జిల్లాలో విద్యుత్ సరఫరాలో కోత విధించారు. రెండు గంటల పాటు కాకినాడ, రెండు గంటల పాటు రాజమహేంద్రవరం నగరంలోనూ విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారం అలుముకుంది. ఒక టౌన్ తర్వాత మరో టౌన్‌లో రెండేసి గంటలపాటు విద్యుత్ సరఫరాను నియంత్రిస్తూ కోత అమలుచేశారు.
కువైట్ నుండి వస్తున్న వివాహిత అదృశ్యం
రామచంద్రపురం, సెప్టెంబర్ 22: ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లిన రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన ఒక వివాహిత స్వదేశానికి తిరిగివస్తూ, హైదరాబాద్‌లో అదృశ్యమయ్యంది. ఈమేరకు శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేసినట్టు ఆమె భర్త కొల్లపు రాంబాబు శుక్రవారం స్థానిక విలేఖర్లకు తెలిపాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కొల్లపు రాంబాబుకు యానాంకు చెందిన దేవితో 2009లో వివాహమయ్యింది. 2015లో ఆమె ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లిందని రాంబాబు తెలిపారు. తమకు పిల్లలు లేరని రాంబాబు తెలిపాడు. ఈ నెల 13న కువైట్ నుండి బయలుదేరుతున్నట్టు తనకు భార్య దేవి నుండి వర్తమానం అందించిందని, భార్యను రిసీవ్ చేసుకోవడానికి తాను శంషాబాద్ వెళ్లగా, తన భార్య దేవి ఆచూకీ తెలియరాలేదని రాంబాబు పేర్కొన్నారు. ముంబైలో దిగిన అనంతరం అక్కడ నుండి హైదరాబాద్ (శంషాబాద్) విమానాశ్రయానికి చేరుకుందని రాంబాబు తెలిపారు. ఫ్లైట్ టిక్కెట్ల ఆధారంగా ఆమె హైదరాబాద్‌కు వచ్చినట్టు ధ్రువీకరణ అయ్యిందన్నారు. దీనితో తన భార్య అదృశ్యమైనట్టు శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రాంబాబు వెల్లడించారు.
డైట్ సెట్‌లో వనజకు ప్రథమ ర్యాంకు
మండపేట, సెప్టెంబర్ 22: ఇటీవల విడుదలైన డైట్‌సెట్ ఫలితాల్లో అంథ విద్యార్థిని తణుకు వనజ రాష్టస్థ్రాయిలో ప్రథమ ర్యాంకును కైవసం చేసుకుని ఆదర్శంగా నిలిచింది. పట్టణంలోని గాంధీ నగరానికి చెందిన వనజ నిరుపేద కుటుంబంలో జన్మించి, పుట్టుకతోనే అంథత్వం కల్గి ఉన్నా అడ్డంకులను అధిగమించి మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో చదువు కొనసాగించింది. నేడు విడుదలైన డైట్ సెట్ ఫలితాల్లో రాష్టస్థ్రాయిలో ప్రథమ ర్యాంకును సాధించి అందరి అభిమానాన్ని పొందింది. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తన కార్యాలయంలో శుక్రవారం విద్యార్థిని వనజను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంథత్వం చదువుకు ఆటంకం కాదని వనజ నిరూపించిందని, రాష్ట్రంలో మండపేట పేరును మార్మోగేలా చేసిందన్నారు. ఈ విద్యార్థినికి కోచింగ్ ఇచ్చిన చల్లా కిశోర్‌తోపాటు సహకారం అందజేసిన ఇనపకోళ్ల గణేష్ చౌదరి, బాబిలను ఎమ్మెల్యే అభినందించారు. వనజతోపాటు ఇనుమర్తి సౌజన్య, వనపర్తి గణేష్‌కోఠి ఉత్తమ ఫలితాలు సాధించారు.

వనం- మనంలో 1.57 కోట్ల మొక్కలు
-కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ, సెప్టెంబర్ 22: జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చదనాన్ని పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నాటికి ఒక కోటీ 57 లక్షల మొక్కలను నాటినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టర్ మిశ్రా ఓ ప్రకటన విడుదల చేశారు. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని అందువల్ల వివిధ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. వనం- మనం కార్యక్రమంలో విద్యార్ధులను భాగస్వామ్యం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఆర్‌అండ్‌బి కాకినాడ ఇఇగా మురళీకృష్ణ
కాకినాడ, సెప్టెంబర్ 22: కాకినాడ రోడ్లు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బి) కార్యనిర్వాహక ఇంజనీర్ (ఇఇ)గా పి మురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఇఇగా పనిచేశారు. ఇంతవరకు డిఇ కెఎస్ రాఘవరావు అదనపు బాధ్యతలను చేపట్టగా ఆయన నుంచి మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో కాకినాడ ఆర్‌అండ్‌బికి శాశ్వత ఇఇని నియమించడం పట్ల నిర్మాణంలో ఉన్న పనులను సకాలంలో పూర్తిచేయవచ్చని ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఇఇగా పదవి చేపట్టిన మురళీకృష్ణను ఆర్‌అండ్‌బి ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షుడు ఎం మాధవరావు, కోశాధికారి సిహెచ్ పాపారావుల ఆధ్వర్యంలో అభినందించారు.