తూర్పుగోదావరి

బాస్కెట్‌బాల్ పోటీలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, సెప్టెంబర్ 24: రామచంద్రపురం పట్టణంలోని శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో ఈ నెల 26 నుండి 3 రోజుల పాటు నిర్వహించే 4వ ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి అంతర్ జిల్లాల సబ్‌జూనియర్స్ బాలుర, బాలికల బాస్కెట్‌బాల్ పోటీల నిర్వహణకు క్రీడా మైదానాన్ని సమాయత్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి, శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జాతీయ జూనియర్ కళాశాల పిడి సీతాపతిరావు, శ్రీకృత్తివెంటి పేర్రాజు పంతులు పశు వైద్య పాలిటెక్నిక్ కళాశాల పీడి అప్పన్న తదితరులు క్రీడా మైదానాన్ని పోటీలకు అనుకూలంగా మార్పులు చేసే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి బాలబాలికలు ఈ పోటీలో పాల్గొనేందుకు వస్తున్నట్లు చక్రవర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ సౌజన్యంతో రాష్ట్ర బాస్కెట్‌బాల్, జిల్లా బాస్కెట్‌బాల్, రామచంద్రపురం బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌ల నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పోటీల ప్రారంభోత్సవ సభకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు తోట త్రిమూర్తులు పాల్గొంటారని, విశిష్ట అతిథులుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రాష్ట్ర శాప్ విసి, ఎండి ఎన్ బంగారురాజు పాల్గొంటారని వివరించారు.
నీట మునిగిన నర్సరీలు
కడియం, సెప్టెంబర్ 24: వర్ష బీభత్సానికి కడియంలోని పలు నర్సరీలు నీట మునిగాయి. ఆదివారం గాలులతో కూడిన వర్షం కురవడంతో కడియపులంకలో రెండుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీనితో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ సిబ్బంది హుటహుటిన ఆ స్తంభాలను పునరుద్ధరించారు. భారీ వర్షాలతో మొక్కల రవాణా, ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ఈ వర్షా కాలం సీజన్‌లో ఆదివారం కురిసిన వర్షాన్ని భారీవర్షంగా నర్సరీ రైతులు చెబుతున్నారు.
పిడుగుపాటుకు మూడు మేకలు మృతి
రాజవొమ్మంగి, సెప్టెంబర్ 24: మండలంలో చెరుకుంపాలెం పంచాయతీ మిర్యాల వీధి గ్రామ సమీపంలో ఆదివారం పిడుగుపడి మూడు మేకలు మృతిచెందాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతోపాటు పిడుగుపడడంతో మేత మేస్తున్న మూడు మేకలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాయి. అదే గ్రామానికి చెందిన మిరియాల రమణకు చెందిన రెండు మేకలు, కుంజం రమేష్‌కు చెందిన ఒక మేక మృతిచెందాయి.