తూర్పుగోదావరి

పేదల సంక్షేమమే టిడిపి ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజులూరు, సెప్టెంబర్ 24: తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని అమలాపురం ఎంపి పండుల రవీంద్రబాబు అన్నారు. ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం పార్టీలో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మతుకుమిల్లి, బంధనపూడి గ్రామాల్లో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల కోసం అనుక్షణం కష్టపడి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో అందుతాయన్న ఆలోచనతో ఇంటింటి తెలుగుదేశం అనే నినాదంతో వస్తున్నామని, ప్రజా అవసరాలను తెలుసుకోవడానికే తప్ప ఓట్లు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేస్తున్న అభివృద్ధి తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రజల మనోభావాలను చూసి తోట త్రిమూర్తులు ఏ స్థాయిలో అభివృద్ధిని చేశారో అర్ధం అవుతోందన్నారు. తోట త్రిమూర్తులు పేదల పక్షపాతి అని పండుల అభివర్ణించారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా జనసందోహంతో ప్రజలు ముందుకు వచ్చి తోటను ఆదరిస్తున్న తీరు తనకు గర్వంగా ఉందన్నారు. ఇలాంటి నాయకుడు తమ పార్టీలో ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. పార్లమెంట్ సభ్యునిగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఎటువంటి అటువంటి అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యే తోటకు తన సహకారం ఉంటుందన్నారు. అనంతరం బందనపూడి గ్రామంలో ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ గ్రామంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగినప్పటికీ స్థానిక ప్రజల కోరిక మేరకు చిరకాల వాంఛ అయిన డ్రైనేజీలతో పాటు, ఇళ్ళ స్థలాల చదును చేసే పనులను త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గొల్లపాలెం-బందపూడి మతుకుమిల్లి వెళ్లే రహదారికి కోటి రూపాయలు మంజూరు చేశామని, జనవరి నాటికి రహదారిని పూర్తి చేస్తామని, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి యాళ్ళ కృష్ణారావు, జడ్పీటిసి యాళ్ళ సూర్యప్రకాష్, మండల పార్టీ అధ్యక్షుడు లీలాశంకర్, సర్పంచ్‌లు సత్యనారాయణ, జకన సూర్యకుమారి, ఎంపిటిసి సభ్యురాలు సలాది పుష్ప, పార్టీ నాయకులు యాళ్ళ బాబు, సలాది వెంకటరమణ, రాజేష్, డాక్టర్ శ్రీరామరెడ్డి, సత్తి గంగాభవానీ, పోతురాజు భీమారావు తదితరులు పాల్గొన్నారు
అదుపుతప్పి ట్రాలీ క్యాబిన్‌పై పడిన గ్రానెట్ రాయ
.
*డ్రైవర్, క్లీనర్లకు తీవ్ర గాయాలు
సామర్లకోట, సెప్టెంబర్ 24: కాకినాడ పోర్టుకు తరలిస్తున్న గ్రానెట్ రాయి తరలిస్తున్న వాహనం క్యాబిన్‌పై ఆదుపుతప్పి పడడంతో వాహనంను నడుపుతున్న డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం పెద్దాపురం ఎడిబి రోడ్డు మీదుగా నిత్యం వందల సంఖ్యలో అతి పెద్ద గ్రానైట్ రాళ్ళలోడుతో కాకినాడ పోర్టుకు భారీ వాహనాలు (ట్రాలీ లారీలు) రాకపోకలు సాగిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో అతిపెద్ద గ్రానైట్ రాళ్ళతో వస్తున్న వాహనం ఎడిబి రోడ్డులోని రాక్ సిరామిక్స్ పరిశ్రమ వద్దకు రాగా, ఆ వాహనంకు ముందు వెడుతున్న మరో వాహనం వేగాన్ని తగ్గించగా, వెనుక వస్తున్న గ్రానైట్ లోడు లారీకి డ్రైవర్ సడెన్ బ్రేకు వేశాడు. దాంతో వాహనం వెనుక వున్న రాయి డ్రైవర్ క్యాబిన్‌పై పడి అనంతరం రోడ్డుపై పడింది. క్యాబిన్ నుజ్జు నుజ్జు అవ్వడంతోపాటుగా డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోగా, క్లీనర్‌కు గాయాలయ్యాయి. పోలీసుల సహకారంతో క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి సామర్లకోట పోలీసులు చెప్పారు.