తూర్పుగోదావరి

నవంబరు నెలాఖరుకు స్వచ్ఛ జిల్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 24: జిల్లాలో బహిరంగ మల విసర్జనకు చరమగీతం పాడి, నవంబరు నెలాఖరుకు స్వచ్ఛ జిల్లాగా ప్రకటించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఈసారి పటిష్ట ప్రణాళికలతో సాగుతోంది. గతంలో లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆచరణలో విఫలమైన అధికారులు ఈ పర్యాయం స్వచ్ఛమైన కార్యాచరణ ప్రణాళికలను అమలుచేసే దిశగా సాగుతున్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు సంకల్ప బలంతో ముందుకు సాగాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు అన్ని వర్గాల వారినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. నవంబరులోగా స్వచ్ఛ జిల్లా ప్రకటన చేయడంతో పాటు అక్టోబరు 2వ తేదీన జరిగే స్వచ్ఛాంధ్ర మిషన్ ప్రత్యేక కార్యక్రమంలో కృషీవలులకు అవార్డులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలో బహిరంగ మల విసర్జన నిర్మూలన, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. కార్యాచరణలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గ్రామస్థాయిలో ఎవరెవరికి మరుగుదొడ్లు లేనిదీ గుర్తిస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండి కూడా వాటిని వినియోగించకుండా వదిలివేసిన వారిని గుర్తిస్తున్నారు. అటువంటి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ విషయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. రెండు నెలల్లో జిల్లాను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో ఇటువంటి చర్యలను నిరోధించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లను ఉద్యమ రూపంలో నిర్మిస్తున్నారు. లబ్దిదారులను గుర్తించిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నారు. ప్రతి గ్రామంలో కనీసం 20 మందితో కమిటీలను ఏర్పాటుచేస్తున్నారు. కమిటీల ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ, ర్యాలీలు నిర్వహించడం, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. స్వచ్ఛ ఉద్యమంలో విశేష సేవలందించిన వ్యక్తులకు, సంఘాలకు స్వచ్ఛ ఆంధ్రా మిషన్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీన అవార్డులు అందజేస్తారు.

కారు నుంచి దట్టమైన పొగలు
కాకినాడ సిటీ, సెప్టెంబర్ 24: వెళ్తున్న కారులోనుండి దట్టమైన పొగలు రావడంతో కారులో ఉన్నవారు కారుదిగి పరుగులుతీసి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం సమయంలో స్థానిక ఆనందభారతి క్రీడాప్రాంగణం వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దశరా ఉత్సవాలు జరుగుతున్న కారణంగా స్థానిక రాగంపేటకు చెందిన లింగేశ్వరరావు అనే వ్యక్తి అతని స్నేహితులతో పిఠాపురంలో ఉన్న దేవాలయానికి ఆదివారం ఉదయం మారుతీ కారులో బయలుదేరి వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు కల్పానాసెంటర్ వచ్చేసరికి డీజల్ ట్యాంక్ నుండి డీజిల్ కారుతున్న విషయాన్ని గమనించారు. ఉదయం కావడంతో కారురిపేర్ చేసేందుకు మెకానిక్ అందుబాటులో లేకపోవడంతో వారు కారును ఆనందభారతి క్రీడాప్రాంగణం వైపు నడుపుతున్న సమయంలో ఇంజన్ నుండి దట్టమైన పొగలు రావడంతో లింగేశ్వరరావు అతని స్నేహితులు కారునుండి దిగి పరుగులు తీశారు. కొద్దిక్షణాలకే కారునుండి పొగలుతోపాటు మంటలు వెలువడటంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలు అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.