తూర్పుగోదావరి

ఇసుక గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 24: తూర్పు గోదావరి జిల్లాలో ఉచిత ఇసుక విధానం గందరగోళంగా మారింది. గోదావరి వరద సీజన్ కావడంతో ఒక్క రాజమహేంద్రవరంలో తప్ప మిగిలిన చోట్ల ఇసుక తీసేందుకు అనుమతి లేదు. దీంతో విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల అక్రమంగా నిల్వ చేసిన ప్రాంతాల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇసుకను ఉచితంగా పొందవచ్చని రాష్ట్ర ప్రభుత్వం విధానాన్ని రూపొందించింది. ఈ ఉచితం మాటున సామాన్యుడికి ఉచితంగా అందిన దాఖలాలు కన్పించడం లేదు. ప్రభుత్వం టెండర్ల విధానం అమల్లో వుండేటపుడు ప్రభుత్వానికి దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఆదాయం లభించేది. ప్రస్తుతం ఆదాయం రావడం సరిలేదు కదా ఉచితంగా ప్రజలకు అందే అవకాశం కూడా లేకుండా పోయింది. బ్యారేజి ఎగువన నావల ద్వారా మాత్రమే ఇసుకను తీయాల్సి వుంది. ఈ మేరకు వరదల సీజన్ కావడంతో ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని రెండు ర్యాంపుల్లో మాత్రమే నావల ద్వారా ఇసుకను తీస్తున్నారు. మరో ర్యాంపులను నిలిపి వేయడంతో వాటి స్థానే కోటిలింగాల ఘాట్ వద్ద ప్రత్యామ్నాయ ర్యాంపులను ఏర్పాటు చేశారు. కానీ ఇసుక మాత్రం డిమాండ్ మేరకు అందకపోవడంతో నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత ఇసుక కోసం వెంపర్లాడే పరిస్థితి కన్పిస్తోంది. ఉచితం మాటున అధిక ధరలకు ఇసుకను పొందుతున్న పరిస్తితి కన్పిస్తోంది. అధికారులు రెండు యూనిట్ల ఇసుకను రూ.2700లకు నిర్ణయించారు. ఇందులో నావల ద్వారా ఇసుక తీసి, లోడింగ్ చేయడం, ర్యాంపులోకి వాహనాలు వెళ్లేందుకు అనువైన బాట తయారీ ఖర్చు వెరసి రూ.2700లకు రెండు యూనిట్ల ఇసుకను అందించాల్సిందిగా కలెక్టర్ ధర నిర్ణయించారు. దీనికి ట్రాన్స్‌పోర్టు చార్జీలను కలిపి ఇసుకను పొందేందుకు దాదాపు రూ. 4వేలు అవుతోందని తెలుస్తోంది. మొత్తం మీద ఉచిత అనేది తూర్పులో గందరగోళంగా మారింది.