తూర్పుగోదావరి

ఉపాధ్యాయ లోకానికి మచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, ఏప్రిల్ 12: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయి ఉండి విద్యార్థులకు విద్యతోబాటు నీతిని బోధించాల్సిన గురుతర బాధ్యత తనపై ఉన్నప్పటికీ తన పాఠశాలలో చదువుతున్న చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ లోకానికి మచ్చ తెచ్చిన ఘటన మంగళవారం మండలంలోని పసలపూడి ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... స్థానిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సిహెచ్ జాన్త్న్రం తమ చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న సమయంలో తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి, తమ చిన్నారుల పట్ల హెచ్‌ఎం లైంగింక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆరోపించారు. గత కొంతకాలంగా జాన్త్న్రం బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని చిన్నారులు తమ దృష్టికి తీసుకువచ్చినట్టు వారి తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఒకసారి చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించగా తాము గట్టిగా హెచ్చరించినా హెచ్‌ఎం ప్రవర్తనలో ఏవిధమైన మార్పు రాలేదన్నారు. కాగా వేధింపులకు గురైన చిన్నారులను జడ్పీటీసీ చిన్నం అపర్ణాదేవి, వైస్-ఎంపిపి దేవు వెంకట్రాజు, ఎంపిటిసి అంపోలు సాయిలక్ష్మి, సొసైటీ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి తదితరులు విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎం తమను తాకకూడని చోట్ల తాకుతూ వేధింపులకు గురి చేస్తున్నాడని చిన్నారులు ప్రజాప్రతినిధులకు తెలిపారు. దీంతో ప్రజాప్రతినిధులు హెచ్‌ఎంను నిలదీశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్‌ఎంపై మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు స్పందించి, సంఘటనపై విచారణ చేపట్టాలని ఎంపిడిఒ జె అరుణ, తహసీల్దారు వై వెంకటేశ్వరరావులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వేగుళ్ల స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు, జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కాగా హెచ్‌ఎం జాన్త్న్రంను వివరణ కోరగా తాను ఎటువంటి వేధింపులకు పాల్పడలేదన్నారు.