తూర్పుగోదావరి

రత్నగిరిపై సీతారాముల కల్యాణ వేడుకలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంఖవరం, ఏప్రిల్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి వారి సన్నిధి రత్నగిరిపై క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవ వేడుకులు గురువారం ప్రారంభమయ్యాయి. రత్నగిరిపై రామాలయంలో ఇఓ కాకర్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి అమ్మవార్లు పెళ్ళి పెద్దలుగా వ్యవహరించగా, సీతారాములను పెండ్లి కుమార్తె, కుమారుడులుగా అలంకరించి ఆశీనులు గావించారు. దేవస్థానం వేదపండితులు నూతన వధూవరులైన సీతారాముల వద్ద విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, ఊల్లూకల గౌరీపూజ నిర్వహించారు. రామాలయం ఆవరణలో వివాహ వేడుకల్లో సాంప్రదాయబద్ధమైన రోలు, రోకళ్లతో ముత్తయిదువులు పసుపు కొట్టగా, వారికి కొబ్బరి బొండాం, తాంబూలాలు అందించారు. అనంతరం వేదపండితులు నీరాజన మంత్రపుష్పం, వేద స్వస్తి నిర్వహించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రామాలయం సమీపానే గల కల్యాణవేదికపై శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.